ఆ మార్కెట్‌లో హిజ్రాలకు నో ఎంట్రీ

  • Published By: madhu ,Published On : September 28, 2019 / 05:04 AM IST
ఆ మార్కెట్‌లో హిజ్రాలకు నో ఎంట్రీ

హిజ్రాలు..చాలా మంది చూస్తే భయపడిపోతుంటారు. కొంతమంది నకిలీ హిజ్రాలుగా చెలామణి అవుతూ..దౌర్జన్యాలకు తెగబడుతుంటారు. వీరిపై గుజరాత్‌లోని ఓ మార్కెట్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. బజారులోకి నో ఎంట్రీ అంటూ హుకుం జారీ చేసింది. దీనిపై హిజ్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సూరత్ మార్కెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 

గుజరాత్‌లోని సూరత్ మార్కెట్‌లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం విధించారు. మార్కెట్‌లోకి ట్రాన్స్‌జెండర్లకు అనుమతి లేదని మార్కెట్ కమిటీ నోటీసులు ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్లు ఓ వ్యక్తిపై దాడి చేయడంతో అతను మృతి చెందాడు. దీంతో మార్కెట్ కమిటీ పై విధంగా నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ విషయాలను గ్రహించిన మార్కెట్ కమిటీ వారిపై నిషేధం విధించింది. మార్కెట్‌లోకి వారికి అనుమతి లేదని తేల్చిచెప్పింది. 

మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై హిజ్రాలు మండిపడుతున్నారు. నిర్ణయం సరికాదని చెబుతున్నారు. తాము పండుగలప్పుడు మాత్రమే మార్కెట్‌లోకి వచ్చి డబ్బులు అడుక్కుంటామని..తమను నిషేధించడం బాధాకరమని అంటున్నారు హిజ్రాలు. 

నకిలీ హిజ్రాలతో చాలా మంది పరేషన్ అవుతున్నారు. వారి వెకిలి చేష్టలతో ఇబ్బందులకు గురి చేస్తోంది. శుభకార్యం, షాపింగ్ మాల్స్ ఓపెన్ ఓపెన్, కొత్తగా రంగులు వేసిన ఇంటికి పూల దండ ఉండినా..అక్కడ వీరు వాలుతుంటారు. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుంటారు. యజమానులు మొండికేస్తే..బెదిరించి మరీ వసూళ్లకు పాల్పడుతుంటారు. ఎ:దుకు గొడవ..అంటూ..ఎంతోకొంత సమర్పిస్తుంటారు. తాజాగా గుజరాత్ సూరత్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 
Read More : ఇచ్చిన మాట పూర్తి : హరీశ్ సాల్వేకే ఒక్క రూపాయి ఫీజు