SC-ST Reservation: రిజర్వేషన్లు పెంచాలని కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాకట సీఎం.. ఎనిమిదేళ్ల క్రితం చేసిన కులగణన మళ్లీ తెరపైకి

ఎనిమిదేళ్ల క్రితం మా ప్రభుత్వంలో 162 కోట్ల రూపాయల ఖర్చుతో కులగణన సర్వే చేశాము. వాటిని ఇప్పుడు అమలు చేసే ప్రయత్నం చేస్తాము. ఇటీవల అధికారంలో కొనసాగిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపించిన వేళ హడావుడిగా రిజర్వేషన్లు పెంచి జిమ్మిక్కులు చేసింది

SC-ST Reservation: రిజర్వేషన్లు పెంచాలని కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాకట సీఎం.. ఎనిమిదేళ్ల క్రితం చేసిన కులగణన మళ్లీ తెరపైకి

Karnataka CM siddarmaiah

Karnataka Politics: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచడమే కాకుండా వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‭కి మార్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఒక ప్రధాన కులానికి ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, ఏ కులానికి చెందినవారు ఎంత జనాభా ఉన్నారు, వారిలో విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారులు, వారి జీవన విధానం ఏ విధంగా సాగుతోందనే రీతిలో ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్రంలో చారిత్రాత్మకంగా జరిపిన కులగణన సర్వే మరోసారి తెరపైకి వచ్చారు.

Smriti Irani: ప్రేమ అని మాట్లాడుతున్నారు.. అది ఇందులో భాగమేనా రాహుల్?: స్మృతీ ఇరానీ

ఈ నివేదిక ఆధారంగానే తాజా నిర్ణయం తీసుకున్నారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ సర్వే చేశారు. కాగా, ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ‘‘ఎనిమిదేళ్ల క్రితం మా ప్రభుత్వంలో 162 కోట్ల రూపాయల ఖర్చుతో కులగణన సర్వే చేశాము. వాటిని ఇప్పుడు అమలు చేసే ప్రయత్నం చేస్తాము. ఇటీవల అధికారంలో కొనసాగిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపించిన వేళ హడావుడిగా రిజర్వేషన్లు పెంచి జిమ్మిక్కులు చేసింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు వీలు లేకుండా ఉండాలనే ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజుల ముందు ప్రకటించారు’’ అని అన్నారు.

IP University: కేజ్రీవాల్ మాట్లాడుతుండగా ‘మోదీ.. మోదీ’ నినాదాలు చేసిన విద్యార్థులు.. కేజ్రీవాల్ ఏమన్నారో తెలుసా?

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణను గందరగోళం చేశారు. అన్ని కులాల విశ్వాసంతో రిజర్వేషన్లు కల్పించాలనే మా సూచనలను పాటించలేదు. బీజేపీ గతంలోనూ రిజర్వేషన్లను వ్యతిరేకించింది. అలాంటి పార్టీ ఎన్నికల వేళ హడవుడి చేసింది. గతంలో మా ప్రభుత్వం బీసీ కమిషన్‌ ద్వారా కులాల ఆధారంగా సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలకు సంబంధించి సమీక్ష నిర్వహించాము. గత ప్రభుత్వాలు దీనిపై వెనుకడుగు వేశాయి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చాము. అప్పటి నివేదికను తీసుకుంటాం. ప్రజలకు విద్య, ఉద్యోగంతోపాటు విభిన్న రంగాల్లో అవకాశాలను మెరుగుపరచడమే మా లక్ష్యం’’ అని అన్నారు.