Himachal Pradesh Election Counting 2022 : హిమాచల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా? కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు షురూ

హిమాచల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా? అన్నట్లుగా ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు షురూ చేసింది.బీజేపీ ఆపరేషన్‌ లోటస్.. ప్రయత్నాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను తరలించాలని ఆలోచిస్తోంది.

Himachal Pradesh Election Counting 2022 : హిమాచల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా? కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు షురూ

Himachal Pradesh Election Counting 2022

Gujarat–Himachal Pradesh Election Counting 2022 : గుజరాత్ ఎన్నికల్లో దూసుకుపోతున్న బీజేపీ మరోపక్క హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ కు చెమటలు పట్టిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతున్నాయి ఎన్నికల ఫలితాల్లో..ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అప్రమత్తమైంది. క్యాంపు రాజకీయాలు షురూ చేసింది.గుజరాత్ లో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా సాధించే పరిస్థితుల్లో లేని కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం మ్యాజిక్ ఫిగర్ కు చేరువైంది. కాంగ్రెస్ కు చెమటలు పట్టిస్తూ బీజేపీ కూడా తన హవాను కొనసాగిస్తోంది. దీంతో ఏ సమయంలో అయినా బీజేపీ హవా ఎక్కడ పెరుగుతుందోననే ఆందోళనతో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు ప్రారంభించింది.

అటు గుజరాత్ ఇటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న క్రమంలో గుజరాత్‌లో బీజేపీ గత రికార్డులను బ్రేక్‌ చేసి.. ఏడోసారి అధికారం చేపట్టే దిశగా ముందుకుసాగుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. మినిట్‌ టు మినిట్‌ వెలువడుతున్న ఫలితాలతో ఇరు రాజకీయ పార్టీల్లో టెన్షన్ పీక్స్ లోకి వెళుతోంది. ఒకసారి కాంగ్రెస్‌కు ఆధిక్యత వస్తే.. వెంటనే బీజేపీ కూడా లీడ్‌లోకి వస్తోంది. ఇలా గుజరాత్ ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ కనీసం హిమాచల్ ప్రదేశ్ లో అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఈక్రమంలో క్యాంపు రాజకీయాలు ప్రారంభించింది.

ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్‌ ప్రకారం.. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ 39, బీజేపీ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా…మిగిలిన స్థానాల్లో ఇండిపెండెంట్లు ఆధిక్యంలో ఉన్నారు. ఇరు పార్టీలు స్వల్ప ఆధిక్యంలోనే కొనసాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో హస్తం పార్టీ వ్యూహాలను సైతం మొదలుపెట్టింది. బీజేపీ ఆపరేషన్‌ లోటస్.. ప్రయత్నాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను తరలించాలని ఆలోచిస్తోంది.
బీజేపీ ఆపరేషన్ లో లోటస్ ఉచ్చులో చిక్కుకోకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను..ఈరోజు సాయంత్రానికి బస్సుల్లో రాజస్థాన్‌ లేదా ఛండీఘడ్ కు  తరలించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వారికి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల తరలింపు బాధ్యతను ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్ భగేల్‌, పార్టీ సీనియర్‌ నేత భూపిందర్‌ సింగ్‌ హుడాకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.

హిమాచల్ ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపులో భాగంగా తొలి ట్రెండ్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అయితే ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలను బట్టిచూస్తే ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిఫిగర్ 35 కంటే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం 38 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో రెండు గంటల్లో పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్‌లు హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమేఅంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో 1985 నుండి, ఏ పార్టీ వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేదు. ఈ కొండ ప్రాంతంలో బీజేపీ మళ్లీ అధికారంలో కొనసాగితే అదో రికార్డుకానుంది. కానీ అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడనే ఆలోచనతో కాంగ్రస్ క్యాంపు రాజకీయాలు ప్రారంభించింది.