Night Curfew : కోవిడ్ విజృంభణ..మరో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ

కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూని అమలు

Night Curfew : కోవిడ్ విజృంభణ..మరో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ

Curfew

Night Curfew : కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూని అమలు చేస్తున్నట్లు హిమాచల్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. సీఎం జైరామ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుందని తెలిపింది.

అంతేకాకుండా రాష్ట్రంలోని ఇండర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు,సినిమా హాళ్లు,జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్ మరియు లంగర్‌లను కూడా మూసివేసింది. పెళ్లిళ్లతో,బాంకెట్ హాల్స్‌తో సహా మూసివేసిన ప్రదేశాలలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు ఇతర సమావేశాలు 50 శాతం సామర్థ్యంతో అనుమతించబడతాయని ప్రభుత్వం తెలిపింది. హోటళ్లు మరియు రెస్టారెంట్లు తెరిచి ఉంచవచ్చని తెలిపింది.

ALSO READ Bharat Biotech : భారత్ బయోటెక్ కీలక ప్రకటన..వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయొద్దు!