Assam CM : బీజేపీకి ‘మియా’ ఓట్లు అవసరం లేదు – హిమంత బిశ్వ శర్మ

వలస వచ్చిన మియాల వల్లనే రాష్ట్రంలో అసోం గుర్తుపు, సంస్కృతీ, భూమి కోల్పోయామని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు బిశ్వ శర్మ అన్నారు.

Assam CM : బీజేపీకి ‘మియా’ ఓట్లు అవసరం లేదు – హిమంత బిశ్వ శర్మ

Assam Cm

Assam CM : అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ.. ఊహించని నిర్ణయాలతో వార్తల్లో ఉంటారు. తాజాగా ఇండియా టుడే కాంక్లేవ్-2021లో హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. బెంగాలీ మూలం నుంచి అసోంకు వచ్చిన ముస్లింల ఓట్లు బీజేపీకి అవసరం లేదని అన్నారు. బెంగాలీ నుంచి వలస వచ్చిన ముస్లింలను అసోంలో మియా ముస్లింలు అంటారు. ఓట్ల కోసం తాను (మియా)వారి వద్దకు వెళ్లనని, వారు కూడా తన వద్దకు రారని అన్నారు. వలస వచ్చిన ముస్లింల వల్లనే రాష్ట్రంలో అసోం గుర్తుపు, సంస్కృతీ, భూమి కోల్పోయామని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు.

Read More : UP Lakhimpur : మరోసారి చీపురు పట్టిన ప్రియాంక

ఇక ఇల్లీగల్ వర్తకం… డ్రగ్స్, గంజాయి వంటి వాటి సరఫరా కూడా పెరిగిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రతి రోజు రూ.2 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను రికవరీ ఉంటున్నట్లు వివరించారు. తాను సీఎం అయిన తర్వాత సరిహద్దులో సమస్యలను చాలా వరకు నివారించానని వివరించారు. ఇక సరిహద్దుల నుంచి వస్తున్న డ్రగ్స్ ని కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Read More : Syringes: వ్యాక్సిన్ సిరంజిల కొరత.. ఎగుమతులపై కేంద్రం నిషేధం

100 రోజుల్లో తమ ప్రభుత్వం 2,000 మంది స్మగ్లర్లను, 500 మంది ల్యాండ్ బ్రోకర్లను అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు వివరించారు శర్మ. భూ వివాదాలను పరిష్కరించేందుకు డిజిటలైజ్ చేసి గిరిజన రైతులతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఇక ఇదే సమయంలో ప్రియాంక గాంధీపై స్పందించారు బిశ్వ.. తాను చీపురుపట్టి శుభ్రం చేసిన వీడియోపై కామెంట్స్ చేశారు. తన తల్లి ఇంట్లో ప్రతి రోజు చీపురుతో శుభ్రం చేస్తుందని, ఇదేమో పెద్ద విషయం కాదని అన్నారు. అందరు మహిళల మాదిరిగానే ప్రియాంక తన గదిని శుభ్రం చేసుకున్నారని వివరించారు.

Read More : Big Boss 5: శ్రీరామచంద్ర.. హమీదా అర్ధరాత్రి ముద్దులు.. షో శృతి మించుతోందా?

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల కోసం లేని సమస్యలు సృష్టిస్తున్నారని బిశ్వ వ్యాఖ్యానించారు. నిజాయితీగా ఎన్నికలను ఎదురుకోలేకే సమస్యలు సృష్టించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా దానికి ముందు ఒక సమస్యను క్రియేట్ చేయడం కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలకు అలవాటుగా మారిందని బిశ్వ అన్నారు.