సుప్రీం చారిత్రాత్మక తీర్పుతో..ఐక్యతా సందేశాన్ని ఇచ్చింది: హిందూ మహాసభ లాయర్

  • Published By: veegamteam ,Published On : November 9, 2019 / 06:35 AM IST
సుప్రీం చారిత్రాత్మక తీర్పుతో..ఐక్యతా సందేశాన్ని ఇచ్చింది: హిందూ మహాసభ లాయర్

వివాదాస్పదన అయోధ్యలో రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.  సుప్రీం తీర్పు అనంతరం హిందూ మహాసభ న్యాయవాది వరుణ్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. “ఇది చారిత్రాత్మక తీర్పు. ఈ తీర్పుతో, సుప్రీంకోర్టు ఐక్యతా సందేశాన్ని ఇచ్చింది” అని అన్నారు. 

రాజకీయాలు, చరిత్రలకు అతీతంగా న్యాయం నిలబడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం మత విశ్వాసాలను పరిగణనలోకి తీసున్నామనీ.. చెప్పటం చాలా మంచి ఉద్ధేశమని భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పటానికి సుప్రీంకోర్టు తీర్పు నిదర్శనమని ఆయన అన్నారు. 
రాముడు అయోధ్యలో పుట్టాడని చెప్పటానికి ఎటువంటి సందేహం లేదని చెబుతూనే..ప్రార్థనా మందిరాల చట్టం ప్రాథమిక విలువలు, మత సామరస్యాన్ని పరిరక్షిస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించిందని అన్నారు.

అయోధ్య తుదితీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు చెప్పింది. ‘2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్‌కు అప్పగించండి. ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వండి. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. అయోధ్య చట్టం కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయండి. ఆ భూమిని ట్రస్ట్‌కి అప్పగించండి. ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులను ట్రస్ట్ చేపట్టాలని’ తీర్పులో సుప్రీంకోర్టు వెల్లడించింది.