ఢిల్లీ అల్లర్లల్లో ఆరుగురు ముస్లింలను కాపాడి తీవ్రగాయాలకు గురైన హిందువు

ఢిల్లీ అల్లర్లల్లో ఆరుగురు ముస్లింలను కాపాడి తీవ్రగాయాలకు గురైన హిందువు

శివ విహార్లో బాబ్రీ మసీదు పేలుళ్లు.. హిందు-ముస్లింల అల్లర్లు లాంటి ఆందోళన సృష్టించాలని చేసిన ఆందోళనకారుల ప్రయత్నం వృథాగా మిగిలిపోయింది. పలు కమ్యూనిటీల నుంచి, కులాలు, మతాల నుంచి సాయం చేసేందుకు వచ్చిన ఘటన అందరినీ కదిలించింది. ప్రేమ్‌కాంత్ బాగెల్ అనే హిందూ వ్యక్తి.. పొరుగింటిలో ఉండే ముస్లిం కుటుంబాన్ని తాను కాలిపోతున్నా పట్టించుకోకుండా కాపాడాడు. 

ప్రమాదంలో ఉన్నారని తెలిసిన వెంటనే ముస్లిం సోదరులను కాపాడాలంటూ ముందుకొచ్చాడు. కొందరు ఆందోళనకారులు ముస్లిం కుటుంబాలపై పెట్రోల్ బాంబులు విసిరి ప్రమాదం సృష్టించారు. ‘శివ విహార్లో ఉన్న ఉంటున్న హిందూ-ముస్లిం కమ్యూనిటీల మధ్య చిచ్చు పెట్టాలని భావించిన ఆందోళనకారుల వ్యూహం బెడిసి కొట్టింది’ అని బాగెల్ చెప్పుకొచ్చాడు. 

ఆ కుటుంబంలో ఉన్న ఆరుగురిని కాపాడిన బాగెల్ సక్సెస్ అయ్యాడు. కానీ, అప్పటికే 70శాతం కాలిపోయాడు. సరైన సమయానికి హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి అంబులెన్స్ కూడా అందుబాటులో లేకుండాపోయింది. కుటుంబం, స్నేహితులు బతకడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయంటూ బాధపడటం వంతు అయింది. రాత్రంతా ఎదురుచూసి తెల్లవారుజాము సమయంలో జీటీబీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. 

ప్రాణాలు కాపాడేందుకు వెంటనే చికిత్స మొదలుపెట్టారు వైద్యులు. ‘భిన్నత్వంలో ఏకత్వం’ బతికి ఉండాలని కోరుకునే వ్యక్తి కోసం దేశమంతా ప్రార్థనలు చేస్తుంది.