Hindu Temple under Mosque: మసీదు నిర్మాణ సమయంలో బయటపడ్డ హిందూ ఆలయ శిధిలాలు: రంగంలోకి వి.హెచ్.పి

మసీదు పునర్నిర్మాణ సమయంలో జరిపిన తవ్వకాల్లో హిందూ ఆలయం తాలూకు శిధిలాలు బయటపడ్డ ఘటన కర్ణాటక రాష్ట్రం మంగుళూరు నగర శివారులో చోటుచేసుకుంది.

Hindu Temple under Mosque: మసీదు నిర్మాణ సమయంలో బయటపడ్డ హిందూ ఆలయ శిధిలాలు: రంగంలోకి వి.హెచ్.పి

Temple

Hindu Temple under Mosque: మసీదు పునర్నిర్మాణ సమయంలో జరిపిన తవ్వకాల్లో హిందూ ఆలయం తాలూకు శిధిలాలు బయటపడ్డ ఘటన కర్ణాటక రాష్ట్రం మంగుళూరు నగర శివారులో చోటుచేసుకుంది. మంగుళూరులోని మలాలి ప్రాంతంలో గురువారం వెలుగు చూసిన ఈఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. గతంలో అక్కడ హిందూ ఆలయం ఉండేదని. ఆ ఆలయంపైనే జుమా మసీదు కట్టారంటూ, ఆలయంపై అవగాహన ఉన్న కొందరు వ్యక్తులు మీడియాకు వెల్లడించారు. ఎన్నో రోజులుగా మలాలిలో జుమా మసీదు ఉంది. అయితే ఇటీవల మసీదులో మరమ్మతులు నిర్వహించాలని భావించిన ముస్లిం మత పెద్దలు ఈమేరకు కొన్ని తవ్వకాలు చేపట్టారు. తవ్వకాలు చేస్తున్న సమయంలో ఆలయ మండపంలో ఏర్పాటు చేసే స్తంభం, దర్వాజా వంటి ఆకృతులు బయటపడ్డాయి. ఘటనపై సమాచారం అందుకున్న విశ్వహిందు పరిషత్ ప్రతినిధులు..మసీదు ఉన్న ప్రాంతానికి చేరుకొని నిర్మాణ పనులను అడ్డుకున్నారు.

Also read:Celebrities Advertisements: పాన్ మసాలా ప్రమోషన్లు.. హీరోలకు బాధ్యత లేదా?

విషయాన్నీ జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి..మసీదు నిర్మాణం జరుపుకుండా స్టే ఆర్డర్ తీసుకువచ్చారు. ఈవ్యవహారంపై దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ కేవీ రాజేంద్ర స్పందిస్తూ..మసీదు నిర్మాణ ప్రాంతంలో హిందూ ఆలయ శిధిలాలు బయటపడిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. భూమికి సంబందించి పత్రాలు, ప్రభుత్వ రికార్డులను పరిశీలించి తదుపరి ఆదేశాలు వెల్లడించే వరకు మసీదు నిర్మాణం చేయకూడదని ముస్లిం మత పెద్దలను కమిషనర్ ఆదేశించారు. “ఈ సమస్యపై క్షేత్రస్థాయి అధికారులు, పోలీసు శాఖ నుంచి నాకు సమాచారం అందింది.

Also read:Drugs in Gujarat: గుజరాత్ పోర్టులో రూ.1300 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం

భూమికి సంబందించిన పత్రాలు, యాజమాన్య వివరాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం పరిశీలిస్తోంది. మేము ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ మరియు వక్ఫ్ బోర్డు నుండి నివేదికలు తీసుకుని సమస్య పరిష్కరిస్తాము”అని దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కేవీ ANI వార్తా ప్రతినిధికి తెలిపారు. ఇరువర్గాల వాదనలను పరిగణలోకి తీసుకుని త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు ఆ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని అధికారులు ఆదేశించారు. ఇరువర్గాలు సంయమనం పాటించి శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలను కోరారు అధికారులు.