Taslima Nasreen : హిందూ గ్రామాలు తగలబడుతుంటే బంగ్లా ప్రధాని ఫ్లూట్ వాయిస్తున్నారు

బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులను ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీమ్ ఖండించారు. హిందువులపై దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తీరుపై తస్లీమా

Taslima Nasreen :  హిందూ గ్రామాలు తగలబడుతుంటే బంగ్లా ప్రధాని ఫ్లూట్ వాయిస్తున్నారు

Bangla

Taslima Nasreen  బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులను ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీమ్ ఖండించారు. హిందువులపై దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తీరుపై తస్లీమా విమర్శలు గుప్పించారు.

ఆదివారం(అక్టోబర్-17)రాత్రి బంగ్లాదేశ్ లోని పిర్గంజ్, రంగాపూర్ జిల్లాల్లోని రెండు హిందూ గ్రామాలను జీహాదీలు తగులబెట్టారని తస్లీమా తెలిపారు. మంటల్లో బూడిదవుతున్న గ్రామానికి సంబంధించిన ఒక ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన తస్లీమా..ఇంత జరుగుతున్నా బంగ్లాదేశ్ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా ఫ్లూట్ వాయిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వేలాది మంది హిందువులు.. ఇళ్లు కూల్చివేయబడి లేదా దగ్ధమైన తర్వాత నిరాశ్రయులయ్యారని..కానీ షేక్ హసీనా మాత్రం ఇవాళ ఆమె సోదరుడు షేక్ రస్సెల్ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటుందని తస్లీమా విమర్శించారు.

Bang

కాగా,గడిచిన నాలుగైదు రోజులుగా బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు జరగుతున్న విషయం తెలిసిందే. దేశంలోని పలు చోట్ల హిందూ ఆలయాలు కూడా ధ్వంసం చేయబడ్డాయి. దుర్గా మండపాలపై దాడితో బంగ్లాదేశ్ లో ఈ ప్రస్తుత తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫేస్ బుక్ పోస్ట్ లలో ఇస్లాం మతాన్ని కించపరిచారని ఆరోపిస్తూ… ఆదివారం రాత్రి దుండగుల బృందం 66 మంది ఇళ్లను ధ్వంసం చేయడంతో పాటు  20 హిందువుల ఇళ్లను దహనం చేసింది. ఇక,తమపై దాడులకు నిరసనగా మైనారిటీ వర్గాల ప్రజలు ఆదివారం దేశ వ్యాప్తంగా నిరాహార దీక్ష చేపట్టారు.

ALSO READ షేర్ మార్కెట్ పరుగులు.. భారీ లాభాలు ఆర్జించిన టెక్, బ్యాంకింగ్ రంగాలు