క్రిస్మస్ రోజున హిందువులు చర్చికి వెళ్తే చితక్కొడతాం : భజరంగ్ దళ్

  • Published By: sreehari ,Published On : December 5, 2020 / 12:55 PM IST
క్రిస్మస్ రోజున హిందువులు చర్చికి వెళ్తే చితక్కొడతాం : భజరంగ్ దళ్

Hindus will be beaten if they visit church on Christmas: క్రిస్మస్ రోజున ఎవరైనా హిందువులు చర్చిలకు వెళ్తే చితకబాదుతామంటూ హిందూ ధార్మిక సంస్థ భజరంగ్ దళ్ హెచ్చరించింది. అసోంలోని కాచార్ జిల్లాలో భజరంగ్ దళ్ సభ్యుల్లో ఒకరు ఈ వ్యాఖ్యలు చేశారని బరాక్ బులిటెన్ నివేదిక వెల్లడించింది.

‘క్రిస్మస్ రోజున ఎవరైనా హిందువులు చర్చిలకు వెళ్తే.. వారిని చితకబాదుతాం’ అని భజరంగ్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మితూన్ నాథ్ హెచ్చరించారు.



షిల్లాంగ్‌లో క్రిస్మస్ రోజున దేవాలయాలను మూసేస్తున్నారని, హిందువులు వారితో కలిసి చర్చిలో వేడుకులు జరుపుకుంటున్నారు. ఇలా జరగొద్దు.. ఇలా మేం జరగనివ్వం..

హిందువులు ఇలా చేయడానికి మేం అనుమతించం’ అంటూ వ్యాఖ్యానించారు. మేఘాలయ రాజధానిలోని షిల్లాంగ్‌లోని క్వింటన్ రోడ్‌లో వివేకనంద కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఘటనను ఉదహరించారు.



డిసెంబర్ 26న వార్తల్లో ఎలాంటి హెడ్ లైన్స్ ఉండబోతాయో మాకు తెలుసునని ఆయన అన్నారు. బజరంగ్ దళ్ గుండాలు ఒరియెంటల్ స్కూల్ ధ్వంసం చేశారనే న్యూస్ ప్రతి వార్తాపత్రికలోనూ వస్తుందని అన్నారు.

కానీ, మేం మాత్రం భయపడం.. క్రిస్మస్ వేడుకల్లో హిందువులను పాల్గొనేందుకు అనుమతించేది లేదు’ అని స్పష్టం చేశారు. మీడియాపై కూడా నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను మీడియా కూడా గుండాలని అంటోంది.



మా హిందు మహిళలను ఎవరైనా అసభ్యంగా తాకినా వేధించినా మేం నిజంగానే గుండాలుగా మారిపోతాం.. మహిళలను వేధించేవారి తాట తీస్తాం..

ఈ విషయంలో మేం గర్వపడతామంటూ నాథ్ వ్యాఖ్యానించారు.



మరోవైపు బలవంతపు మతమార్పిడి, మతాంతర వివాహాలను నిషేధిస్తూ యూపీలో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.