Lok Sabha Elections 2024: విపక్షాల ఐక్యతలో కీలక ఘట్టం.. కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ కీలక ప్రకటన

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మంత్రి తేజస్వీ యాదవ్ ఉమ్మడి ప్రకటన చేశారు.

Lok Sabha Elections 2024: విపక్షాల ఐక్యతలో కీలక ఘట్టం.. కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ కీలక ప్రకటన

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024: దేశంలోని విపక్ష పార్టీలను ఏకం చేసే విషయంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ ఏకాభిప్రాయానికి వచ్చి నిర్ణయం తీసుకున్నాయి. ఆ మూడు పార్టీలు ఢిల్లీలో సమావేశం నిర్వహించాయి.

అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మంత్రి తేజస్వీ యాదవ్ ఉమ్మడి ప్రకటన చేశారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇదో చారిత్రక అడుగు అని, ప్రతిపక్ష పార్టీల దార్శనికతను పెంపొందించుకుని ముందుకు సాగుతామని చెప్పారు. దేశం కోసం అందరం కలిసికట్టుగా ఉంటామని అన్నారు.

వీలైనన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి, కలిసికట్టుగా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ చివరి వారంలో విపక్ష పార్టీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలోని విపక్ష పార్టీలతో మల్లికార్జున ఖర్గే, నితీశ్ కుమార్ సంప్రదింపులు జరుపుతారని ఆయా పార్టీ వర్గాలు తెలిపాయి.

కాగా, 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని కాంగ్రెస్ కొన్ని నెలల నుంచి ప్రయత్నిస్తోంది. అయితే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ కి సమాన దూరం పాటిస్తూ కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

దేశంలోని విపక్షాలను ఏకం చేయడంపై కాంగ్రెస్ దృష్టి పెడుతోంటే మమతా బెనర్జీ మాత్రం కాంగ్రెస్ ను కూడా దూరం పెట్టాలని ప్రణాళికలు వేసుకున్నారు. పలు రాష్ట్రాలలో బీజేపీ, కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగి లోక్ సభ ఎన్నికల్లో తాము ఇదే వ్యూహాన్ని అమలు చేస్తామని అంటున్నారు.

Lok Sabha elections-2024: ఎన్నికల ముందు రాజకీయాల్లోకి శిఖర్ ధావన్?