Holi 2022 : దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు..

Holi 2022 : హోలీ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు.

Holi 2022 : దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు..

Holi 2022 Pm Modi, Amit Shah Call For Brotherhood In Holi Wishes

Holi 2022 : దేశంలోని ప్రముఖ పండుగలలో హోలీ పండుగ ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగ హోలికా దహన్‌తో ప్రారంభమవుతుంది. మార్చి 18 (శుక్రవారం) హోలీ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. ‘అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హోలీ వేడుకల్లో పాల్గొని దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులు, ఆనందంతో పాటు శాంతి, అదృష్టం కొత్త శక్తిని నింపాలని కోరుకుంటున్నాను” అని అమిత్ షా ట్వీట్ చేశారు.


ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. “హోలీ ప్రత్యేక సందర్భంగా శుభాకాంక్షలు. ఇది రంగులు, సానుకూలత, చైతన్యం, ఆనందం, సామరస్యంతో ముడిపడి ఉన్న పండుగ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హృదయాలను కలిపే పండుగ హోలీ అంటూ రాహుల్ దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అందరికి హోలీ శుభాకాంక్షలు అంటూ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ రంగుల పండుగ మీ జీవితంలో కొత్త ఆనందాన్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. పరస్పర ప్రేమ, మరస్యంతో కలిసి ఈ పండుగను జరుపుకోవాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

తెలంగాణ ప్రజ‌లకు సీఎం కేసీ‌ఆర్‌ హోలీ శుభా‌కాం‌క్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజ‌లకు ముఖ్యమంత్రి కేసీఆర్ హోలీ పండుగ శుభా‌కాం‌క్షలు తెలి‌పారు. అన్ని వర్గాల ప్రజలు కలి‌సి‌మె‌లిసి సంతో‌షంగా సాగా‌లనే సందే‌శాన్ని హోలీ రంగుల పండుగ ఇస్తుందని అన్నారు. ప్రకృతి మెచ్చే రంగు‌లతో హోలీని ఆనం‌దో‌త్సా‌హా‌లతో జరు‌పు‌కో‌వా‌లని సీఎం సూచించారు.


మరోవైపు.. భారత ప్రభుత్వం ఈ ఏడాదిలో సరికొత్త కాన్సెప్ట్ తీసుకువచ్చింది. నేటి హోలీ వేడుకను మీ తల్లులతో కలిసి సెలబ్రేట్ చేసుకొవాలని కేంద్రం సూచించింది. తమ తల్లులతో భోజనం చేసి ఆ ఫోటోలను (#MaaKeSangKhana) మీల్ విత్ మామ్.. తల్లితో కలిసి భోజనం (#MealWithMom) అని హ్యాష్ ట్యాగ్ జత చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించింది. వీటిల్లో కొన్నింటిని ఎంపిక చేసి తమ అధికారిక.. కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో పోస్ట్ చేస్తామని పేర్కొంది.

Read Also : Holi 2022 : హ్యాపీ హోలీ.. మీ ప్రియమైన వారికి వాట్సాప్ హోలీ స్టిక్కర్లను పంపుకోండిలా..!