వంటింటి వైద్యంతో కరోనాను కట్టడిచేయవచ్చంటూ అసత్యప్రచారం…నమ్మకండి

  • Published By: chvmurthy ,Published On : March 13, 2020 / 06:02 AM IST
వంటింటి వైద్యంతో కరోనాను కట్టడిచేయవచ్చంటూ అసత్యప్రచారం…నమ్మకండి

కరోనా వైరస్ సోకి భారత్ లో ముగ్గురుచనిపోయారు. దీనికి మందు ఇంట్లోనే ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం  కరోనా బారిన పడకుండా హోమియో మందు వేసుకోమని  చెపుతూ కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ చెప్పిందని చెపుతూ ఒక హోమియో మందు సోషల్ మీడియా లోవైరల్ అయ్యింది. ఇది ఫేక్. నమ్మకండి.  

ఇదే తరహాలో ఇప్పుడు  కరోనావైరస్ బారిన పడకుండా దాని నుంచి రక్షింపబడటానికి ఇంట్లో ఉండే ఆహార పదార్ధాలతో రక్షణ పొందమనిచెపుతూ ఒక పాఠశాల ప్రిన్సిపాల్ ఇచ్చిన ప్రకటనను వేలాదిమంది షేర్ చేశారు.
విశాఖపట్నంలోని గోపాలపట్నంలోని అళ్వార్ స్కూల్ ప్రిన్సిపాల్ ఈ వైద్యాన్నిప్రచారం చేస్తున్నారు. భారతీయ వైద్యవిధానాన్ని అనుసరిస్తున్న కుటుంబంలో పుట్టిన వైద్యుడు దీన్ని నిరూపించాడని చెప్పారు. చాలామంది రోగులపై దీన్ని ప్రయోగించి ఫలితం సాధించనట్లు చెపుతున్నారు. ఆయన తెలిపిన వైద్యం ఏమిటంటే…
 

ఎనిమిది వెల్లుల్లి రేఖలు, 12 లవంగాలను తీసుకుని…ఆ రెంటిని  దంచుకోవాలి. ఆ మిశ్రమాన్ని  7 కప్పుల నీటిలో మరిగించాలి. కొద్ది సేపు అలా మరిగించగా వచ్చిన మిశ్రమాన్ని తిని…మిగిలిననీటిలో 3 స్పూనుల పసుపు కలిపి  త్రాగాలని చెప్పారు. అలా 3 రోజులు చేస్తే  రోగం మాయమవుతుందన్నారు. చైనా వైద్యుడు ఈ విధానాన్ని అవలంబించినట్లు ప్రిన్సిపాల్ తన లెటర్ లో పేర్కోన్నారు. ఇప్పుడు ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

corona virus letter

కరోనాపై అవగాహనలేని కొందరు చేస్తున్న ప్రచారం. దీనివల్ల అందరికీ నష్టం. కరోనాకు ఇప్పటివరకు ఇదీ మెడికేషన్ అంటూ ఏం లేదు. బాధితుని రోగ నిరోధక శక్తిని పెంచి, వైరస్ ను ఎదుర్కొనే శక్తినిస్తున్నారు. మలేరియా నుంచి ఏబోలా వరకు, పెరాసెట్మాల్ నుంచి ఎయిడ్స్ మందుల వరకు చాలా కాంబినేషన్లను టెస్ట్ చేస్తున్నారు. అయినా పూర్తిగా వైద్యవిధానం అంటూ ఏం లేదు. 

అలాంటి కరోనాను… వెల్లుల్లి, లవంగాల పేస్ట్ తో నయం అవుతుంది, నివారించొచ్చన్న ప్రచారం అందరికీ నష్టంచేస్తుంది. ఇది వైద్యవిధానంకానేకాదు. ఇలాంటి ప్రచారాన్ని అస్సలు నమ్మకండి. పొడిదగ్గు, ఆయాసం, జ్వరముంటే వెంటనే హాస్పటల్‌కెళ్లండి.  

 

Read More:

*  అనంతపురం జిల్లాలో ఇద్దిరికి కరోనా లక్షణాలు?

తిరుమలకు వచ్చే భక్తులూ.. మాస్కులు, శానిటైజర్లు తెచ్చుకోండి : టీటీడీ