కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా!

  • Publish Date - August 9, 2020 / 12:49 PM IST

కరోనా మహమ్మారి నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోలుకున్నారు. ఆయన కరోనా నివేదిక ప్రతికూలంగా వచ్చింది. బిజెపి ఎంపి మనోజ్ తివారీ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. హోంమంత్రి అమిత్ షా కోవిడ్-19 నివేదిక ప్రతికూలంగా వచ్చిందని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఆగస్టు 2వ తేదీన కరోనా బారిన పడటం గురించి అమిత్ షా స్వయంగా ట్వీట్ చేశారు. “కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకోగా.. నివేదిక పాజిటివ్ వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది, కానీ వైద్యుల సలహా మేరకు నేను ఆసుపత్రిలో చేరాను.” అని అప్పుడు ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన కరోనా నుంచి కోలుకున్నారు.

ఇదిలా ఉంటే అమిత్ షా ఆరోగ్యం గురించి పెట్టిన ట్వీట్‌ను కాసేపటికి మనోజ్ తివారీ తొలగించారు. కారణాలను మాత్రం వెల్లడించలేదు.

భారతదేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య రికార్డు స్థాయిలో 21 లక్షల 53 వేలకు చేరుకుంది. వీరిలో 43,379 మంది మరణించగా, 14 లక్షల 80 వేల 884 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో, 64 వేల 399 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 861 మరణాలు సంభవించాయి.

ట్రెండింగ్ వార్తలు