కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అమిత్ షా

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అమిత్ షా

Home Minister కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఢిల్లీలోని మేదాంత హాస్పిటల్ లో నరేష్ త్రీహాన్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం సమక్షంలో కరోనా వ్యాక్సిన్ మెదటి డోస్ తీసుకున్నారు. కాగా,గతేడాదిఆగస్టులో కరోనా బారినపడ్డ అమిత్ షా..మేదాంత హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ పొందిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కరోనా తర్వాతి ట్రీట్మెంట్ కోసం ఎయిమ్స్ లో చేరి తర్వాత డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ కి వెళ్లి కరోనా కట్టడి కోసం హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కోవాగ్జిన్”వేయించుకున్న విషయం తెలిసిందే. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,కేంద్రమంత్రులు జైశంకర్,జితేంద్రసింగ్ కూడా ఇవాళ కోవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న విషయం తెలిసిందే.

కాగా,దేశవ్యాప్తంగా ఇవాళ రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 10వేలకు పైగా ప్రభుత్వ హాస్పిటల్స్,20వేలకు పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి ఒక్క వ్యాక్సినేషన్ సెంటర్ లో రోజుకి 200మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. సీనియర్ సిటిజన్లు(60ఏళ్లు పైబడిన) మరియు 45ఏళ్లు పైబడి అనారోగ్యసమ్యలతో భాధపడుతున్నవారికి రెండో దశలో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.