బెంగాల్ హింసపై నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ

పశ్చిమ బంగాల్​లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కార్యాలయాలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కేంద్ర హోంశాఖ స్పందించింది.

బెంగాల్ హింసపై నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ

Home Ministry

Home ministry పశ్చిమ బంగాల్​లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కార్యాలయాలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కేంద్ర హోంశాఖ స్పందించింది. విపక్షాలే లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆదివారం నుంచి బెంగాల్​లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు కార్యకర్తలు హత్యకు గురయ్యారు. వీరిలో ఇద్దరు బీజేపీకి చెందిన వారు కాగా మరొకరు ఐఎస్ఎఫ్​ కార్యకర్త. రాష్ట్రంలో జరుగుతున్న హింసపై గవర్నర్ ధన్కర్ స్పందించారు. రాష్ట్రంలో చెలరేగుతున్న హింసపై చర్చించేందుకు గవర్నర్..డీజీపీతో పాటు పలువురు అధికారులను రాజ్‌భవన్‌కు పిలిపించారు. హింసను కట్టడి చేయాలని ఆదేశించారు. మరోవైపు, ఇలాంటి ఘర్షణలపై కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా మౌనంగా వ్యవహరించాలని టీఎంసీ కార్యకర్తలకు మమతా బెనర్జీ సూచించారు.

కాగా, ఎన్నికల ఫలితాలు రాగానే ఆరంబాగ్‌లోని బీజేపీ కార్యాలయానికి కొందరు దుండగులు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. తృణమూల్ గూండాలే ఈ పనికి ఒడిగట్టారని బీజేపీ ఆరోపించింది. బెంగాల్​లో ఘర్షణలు చెలరేగటానికి మమతా బెనర్జీ కారణమని బీజేపీ విమర్శించింది. తమ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోందని మండిపడింది. ఘర్షణలకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను సైతం బీజేపీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.