గడ్కరీ ప్రధాని కాబోతున్నారా!: మహా సీఎం కీలక వ్యాఖ్యలు

గడ్కరీ ప్రధాని కాబోతున్నారా!: మహా సీఎం కీలక వ్యాఖ్యలు

2050 నాటికి ఒకరి కన్నా ఎక్కువ మంది మరాఠీలు ప్రధాని పదవిని ఖచ్చితంగా చేపడతారంటూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి రేసులో నితిన్ గడ్కరీ ఉండబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సమయంలో ఫడ్నవీస్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 

నాగ్ పూర్ లోని 16వ జగతిక్ మరాఠీ సమ్మేళన్(ప్రపంచ మరాఠీ సదస్సు) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఎవరైనా భారత్ ని ప్రజలు మెచ్చే విధంగా పరిపాలించారంటే అది మహారాష్ట్ర వ్యక్తులేనని అన్నారు. టచ్ చేసే సత్తా మఠాఠీలకు ఉందని ఆయన అన్నారు.  అటోక్ చేరుకోగలిగే సామర్ధ్యం మరాఠీలకు ఉందని తెలిపారు. ప్రస్తుత పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అటోక్  సిటీని 18వశతాబ్ధంలో మరాఠా ఆర్మీ సేనలు స్వాధీనం చేసుకున్నాయి. జాతీయ గుర్తింపుతో పాటు మరాఠీల గుర్తింపును కూడా కాపాడాల్సిన అవసరముందని అంతకుముందు గడ్కరీ అన్నారు.