Audit Covid Deaths : కరోనా మరణాలపై డెత్‌ ఆడిట్‌ తప్పనిసరి : రణదీప్‌ గులేరియా

దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత రావాలంటే తప్పనిసరిగా కొవిడ్ మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా అన్నారు.

Audit Covid Deaths : కరోనా మరణాలపై డెత్‌ ఆడిట్‌ తప్పనిసరి : రణదీప్‌ గులేరియా

Hospitals, States Must Audit Covid Deaths To Ensure Clarity Aiims Chief

Hospitals, States Must Audit Covid Deaths : దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత రావాలంటే తప్పనిసరిగా కొవిడ్ మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా అన్నారు. కొవిడ్‌ మరణాల లెక్కింపు విషయంలో రాష్ట్రాలు, ప్రభుత్వాల మధ్య వ్యత్సాసం కారణంగా కరోనాను కట్టడి చేసే భారత్ ప్రయత్నాల్లో ఆటంకం కలుగుతోందన్నారు. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నాయనంటూ వస్తున్న ఆరోపణలపై గులేరియా ప్రస్తావించారు.

మధ్యప్రదేశ్‌లో కరోనాకు సంబంధించి అధికారిక గణాంకాలు, ఏప్రిల్‌లో నిర్వహించిన చివరి కర్మల సంఖ్య మధ్య వ్యత్యాసం ఉండటమే ఇందుకు కారణమన్నారు. ఒక వ్యక్తికి అప్పటికే కరోనా ఉండి గుండెపోటుతో చనిపోయినప్పుడు.. అతడి గుండెపోటుకు కొవిడ్ కారణం అయి ఉండొచ్చు.. అలాంటప్పుడు అది కోవిడ్ మరణమని లేదా నాన్‌ కోవిడ్‌గా గుర్తించి గుండెపోటుతో మరణించారని తప్పుగా లెక్కించవచ్చు.

అందుకే అన్ని ఆస్పత్రులు, రాష్ట్రాలు డెత్ ఆడిట్ చేయవలసిన అవసరం తప్పక ఉందన్నారు. లేదంటే మరణాలకు కారణాలు ఏమిటనే విషయం తేలడం కష్టమన్నారు. కరోనా మరణ రేటును తగ్గించడానికి అవసరమైన చర్యలను చేపట్టడానికి వీలు పడుతుంది. స్పష్టమైన కరోనా డేటా లేకపోతే, ఏం చేయలేమన్నారు. కరోనా మరణాలను తగ్గించడానికి ఒక వ్యూహాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.