Police: దారుణం: మరుగుతున్న నూనె పోలీసులపై పోశారు

కరోనా కట్టడికి పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తోంది. ప్రభుత్వాలు లాక్ డౌన్ ఆదేశాలు ఇచ్చిన వెంటనే రంగంలోకి దిగి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల రోడ్లపై వస్తున్న వారిని పోలీసులు అడ్డుకొని కేసులు నమోదు చేస్తున్నారు.

Police: దారుణం: మరుగుతున్న నూనె పోలీసులపై పోశారు

Police

కరోనా కట్టడికి పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తోంది. ప్రభుత్వాలు లాక్ డౌన్ ఆదేశాలు ఇచ్చిన వెంటనే రంగంలోకి దిగి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల రోడ్లపై వస్తున్న వారిని పోలీసులు అడ్డుకొని కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో కొందరు వాహనదారు పోలీసులతో గొడవకు దిగుతున్నారు. ఇదిలా ఉంటే బీహార్ లో ఓ హోటల్ యజమాని పోలీసులపై మరుగుతున్న నూనె పోశాడు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఘటన వివరాల్లోకి వెళితే.. బాంకా స్థానిక శ్యామ్ బజార్‌లో కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ నిర్ణీత సమయం తర్వాత కూడా కొన్ని దుకాణాలు తెరిచి ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసుల బృందం ఆ ప్రాంతానికి చేరుకుంది. హోటల్ మూసివేయాలని పోలీసులు సూచించారు. కానీ హోటల్ యజమాని గణేష్ పండిట్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.. అనంతరం మరుగుతున్న నూనెను పోలీసుపై పోశాడు.

ఈ ఘటనలో పోలీస్ స్టేషన్ హెడ్ రాజ్‌కిశోర్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయలయ్యారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నాలుగు పోలీస్ స్టేషన్ల బలగాలను సంఘటనా స్థలంలో మోహరించారు. ఇక గణేష్ పండిట్ తోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. దాడిలో గాయపడిన పోలీసులను బౌన్సీ రీఫరల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.