Delhi Congress: ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఘర్ వాపసీ’.. ‘ఆప్’లో చేరిన గంటల్లోనే తిరిగొచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లు

ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఘర్ వాపసీ’ కార్యక్రమం విజయవంతమైంది. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన కౌన్సిలర్లు, కాంగ్రెస్ ఢిల్లీ ఉపాధ్యక్షుడు 24 గంటలకు కూడా గడవకముందే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.

Delhi Congress: ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఘర్ వాపసీ’.. ‘ఆప్’లో చేరిన గంటల్లోనే తిరిగొచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లు

elhi Congress: ఢిల్లీలో ఒక్క రోజులోనే రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ నేతలు తిరిగి, తమ సొంత పార్టీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ‘ఘర్ వాపసీ’ విజయవంతమైంది. తాజాగా జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించగా, బీజేపీ ప్రతిపక్షంగా నిలిచింది.

Boy In Borewell: విషాదం.. బోరుబావిలో పడ్డ బాలుడు మృతి.. ఫలించని నాలుగు రోజుల ప్రయత్నం

కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. 250 స్థానాలకుగాను, 9 సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ముగ్గురు కాంగ్రెస్ లీడర్లు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. వీరిలో ఇటీవల కాంగ్రెస్ నుంచి ఢిల్లీ మున్సిపాలిటీలో గెలిచిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా ఉన్నారు. సబిలా బేగమ్, నజియా ఖటూన్ అనే కౌన్సిలర్లతోపాటు ఢిల్లీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అలీ మెహ్దీ కూడా ఆమ్ ఆద్మీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం వీళ్లంతా ఆమ్ ఆద్మీలో చేరారు. అయితే, శనివారం వేకువఝామున రెండు గంటలకు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి సమక్షంలో వీళ్లు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పారు. తామెప్పటికి రాహుల్ గాంధీకి సాధారణ కార్యకర్తలుగానే ఉంటామని ప్రకటించారు.