జ్యోతిరాధిత్య సింధియా రాజీనామాపై మౌనం వీడిన రాహుల్

  • Published By: venkaiahnaidu ,Published On : March 11, 2020 / 12:40 PM IST
జ్యోతిరాధిత్య సింధియా రాజీనామాపై మౌనం వీడిన రాహుల్

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు ఊహించని షాక్ ఇచ్చి ఇవాళ(మార్చి-11,2020) జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరారు. అయితే చాలా రోజుల నుంచి రాహుల్,సోనియాను కలవడానికి సింధియా ప్రయత్నించారని,గాంధీ కుటుంబం సింధియాను ఉద్దేశ్యపూర్వకంగానే పక్కనబెట్టిందని,అందుకే సింధియా కాంగ్రెస్ కు రాజీనామా చేశారని వస్తున్న వార్తలపై ఇవాళ పార్లమెంట్ ఆవరణలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.

తమ ఇంట్లోకి ఎప్పుడైనా నేరుగా రాగలిగిన ఒకే ఒక్క వ్యక్తి జ్యోతిరాధిత్య సింధియా అని రాహుల్ అన్నారు. జ్యోతిరాధిత్యను తాము పక్కనపెట్టిందే లేదన్నారు. కాలేజీలో కూడా సింధియా తనతో ఉన్నాడని రాహుల్ తెలిపారు. సింధియా బీజేపీలో చేరే కొద్దిసేపు ముందు రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సింధియా కాషాయదళానికి టర్న్ అవడంతో ఒక్కసారిగా మధ్యప్రదేశ్ సమీకరణాలు మారిపోయాయి. ఇప్పటికే సింధియా వర్గానికి చెందిన 20మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి బెంగళూరులోని ఓ రిసార్ట్ లో ఉన్నారు. అయితే త్వరలోనే సింధియా వర్గం ఎమ్మెల్యేలందరూ కాషాయ కండువా కప్పుకొని కమల్ నాథ్ సర్కార్ ను కూల్చేసే అవకాశముందని రాజకీయ వర్గాల నుంచి సమాచారం. మధ్యప్రదేశ్ లో కూడా కర్ణాటక మాదిరిగా జరిగితే త్వరలో మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్నాటు చేసే అవకాశాలు సృష్టంగా కనిపిస్తున్నాయి.