LPG Cylinder : గృహ వినియోగ సిలిండర్ ధర త్వరలో పెంపు

ఇంటి ఇల్లాలు త్వరలో బాంబు లాంటి వార్త  వినాల్సి వస్తుంది. గత కొద్ది నెలలుగా స్ధిరంగా ఉన్న గృహా  వినియోగ గ్యాస్ ధరలు మరో వారం  రోజుల్లో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

LPG Cylinder :  ఇంటి ఇల్లాలు త్వరలో బాంబు లాంటి వార్త  వినాల్సి వస్తుంది. గత కొద్ది నెలలుగా స్ధిరంగా ఉన్న గృహా  వినియోగ గ్యాస్ ధరలు మరో వారం  రోజుల్లో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు రూ.105 మేరకు పెంచగా….5 కిలోల సిలిండర్‌ ధర రూ.27 పెంచాయి. అయితే ప్రస్తుతానికి ఇంటిలో వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌ ధరను మాత్రం చమురు సంస్ధలు పెంచలేదు.

అయితే ఉత్తరప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల చివరి విడత పోలింగ్‌ ఈనెల 5న ముగియనుంది. ఈ నేపథ్యంలో.. వచ్చే వారంలో గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్ ధర భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.  మరో వైపు   ఉక్రెయిన్, రష్యా యుధ్ద  నేపధ్యంలో ప్రపంచ  వ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి.  ఇప్పటికే   దేశంలో బల్క్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోలో డీజిల్ తో పాటు.. వంట గ్యాస్ ధరను కూడా పెంచుకునేందుకు కేంద్రం చమురు సంస్ధలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
Also Read : Andhra Pradesh : ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్
అందులో భాగంగానే చమురు సంస్ధలు మంగళవారం వాణిజ్య సిలిండర్ ధరను పెంచాయి. వాణిజ్య సిలిండర్ ధర పెంపు భారం పరోక్షంగా సామాన్యులపై కూడా పడనుంది.  చమరు సంస్ధలు గృహ వినియోగ సిలిండర్ ధర పెంచటం ఖాయం అని తేలినప్పటికీ ఎంతమేర పెంచుతాయనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు. 2021 అక్టోబర్ 6 నుంచి గృహవినియోగ సిలిండర్ ధరల్లో మార్పులేదు. ప్రస్తుత పరిస్ధితుల నేపధ్యంలో రూ. 50 కి పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు