Annamalai: నాలుగే మేకలున్న వ్యక్తి చేతికి రూ.5 లక్షల వాచ్ ఎలా వచ్చింది? బీజేపీని ప్రశ్నించిన డీఎంకే

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిపై డీఎంకే విమర్శలు గుప్పిస్తోంది. నాలుగు మేకలు మాత్రమే ఆస్తి అని చెప్పుకొనే అన్నామలై చేతికి రూ.5 లక్షల విలువైన గడియారం ఎలా వచ్చిందో చెప్పాలని డీఎంకే ప్రశ్నించింది.

Annamalai: నాలుగే మేకలున్న వ్యక్తి చేతికి రూ.5 లక్షల వాచ్ ఎలా వచ్చింది? బీజేపీని ప్రశ్నించిన డీఎంకే

Annamalai: తమిళనాడుకు సంబంధించి బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై డీఎంకే విమర్శలు గుప్పించింది. నాలుగు మేకలు మాత్రమే ఉన్నాయని చెప్పుకునే అన్నామలై చేతికి రూ.5 లక్షల విలువైన గడియారం ఎలా వచ్చిందో చెప్పాలని డీఎంకే ప్రశ్నించింది.

Jharkhand: పెరుగుతున్న శ్రద్ధా తరహా హత్యలు.. భార్యను చంపి 12 ముక్కలు చేసిన భర్త

తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ ట్విట్టర్ వేదికగా దీన్ని ప్రస్తావించారు. అన్నామలై తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఆయన తనకు నాలుగు మేకలు మాత్రమే ఆస్తిగా ఉన్నాయని చెప్పుకొన్నాడు. అయితే, ఆయన చేతికి రూ.5 లక్షల విలువైన బెల్ అండ్ రాస్ లిమిటెడ్ ఎడిషన్ రఫెల్ వాచ్ ఉంది. ఇది ఫ్రెంచ్ కంపెనీ తయారు చేసిన చాలా అరుదైన వాచ్. 500 వాచీల్ని మాత్రమే సంస్థ తయారు చేసింది. ఈ వాచీని అన్నామలై ధరించడంపై డీఎంకే విమర్శలు చేస్తోంది. పేద వాడిగా చెప్పుకొనే ఆయన ఖరీదైన వాచీని ఎలా ధరించాడో చెప్పాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. దీని కొనుగోలుకు సంబంధించిన రశీదును బయటపెట్టాలని కోరుతోంది. దీనిపై అన్నామలై స్పందించాడు.

Mla RohitReddy: మళ్ళీ భాగ్యలక్ష్మి ఆలయానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. బండి సంజయ్ ఎందుకు రాలేదని ఆగ్రహం

‘‘ఈ గడియారం ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ఇది ప్రత్యేక ఎడిషన్ వాచ్. ఇది మనం దేశం వాళ్లు మాత్రమే కొనగలరు. అది కూడా మన దేశం కోసం. ఈ గడియారాన్ని రఫెల్ విమాన విడిభాగాలతో తయారు చేశారు. ఈ వాచీలు 500 మాత్రమే ఉంటే అందులో నా వాచ్ 149వది. రఫెల్ విమానం ఎంట్రీ ఇచ్చాకే యుద్ధ తంత్రం మారిపోయింది. భారతీయ వైమానిక శక్తి మెరుగుపడింది. అందుకే దీని గుర్తుగా ఈ వాచీని వాడుతున్నా’’ అంటూ అన్నామలై చెప్పాడు.