Hearing Power: కరోనా నుంచి కోలుకున్నవారిలో వినికిడి లోపం!

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా దాని ప్రభావం ప్రజలు మీద ఉంటుంది. కరోనా కారణంగా వస్తోన్న సమస్యలు ఏ మాత్రం తగ్గట్లేదు. కరోనా నుంచి కోలుకున్న చాలామంది రోగుల్లో ఇప్పుడు వినికిడి సమస్య కనిపిస్తోంది.

Hearing Power: కరోనా నుంచి కోలుకున్నవారిలో వినికిడి లోపం!

Hearing Power Loss

Corona affect: కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా దాని ప్రభావం ప్రజలు మీద ఉంటుంది. కరోనా కారణంగా వస్తోన్న సమస్యలు ఏ మాత్రం తగ్గట్లేదు. కరోనా నుంచి కోలుకున్న చాలామంది రోగుల్లో ఇప్పుడు వినికిడి సమస్య కనిపిస్తోంది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, మెంటల్ డిజార్డర్ వంటివి ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల్లో కనిపించగా.. ఇప్పుడు కొంతమంది రోగుల చెవులు సరిగ్గా వినిపించట్లేదని ENT నిపుణుల దగ్గరకు ఎక్కువగా వస్తున్నారని వారు చెబుతున్నారు.

ప్రతిరోజూ ప్రైవేట్ ఆసుపత్రులలోని ENT నిపుణులను ఎక్కువగా కరోనా నుంచి కోలుకున్నవారు సంప్రదిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న 30 నుండి 50 సంవత్సరాల వయస్సు గల రోగులలో 20 నుండి 30 శాతం మంది ప్రతిరోజూ ENT డాక్టర్లను సంప్రదిస్తున్నారు. వారికి చెవుల్లో బెల్ శబ్దం, విజిల్ శబ్ధం వినిపిస్తోందని చెబుతున్నారని, చెవుల్లో ఇబ్బందిగా ఉందని చెబుతున్నారని, ENT విభాగం డాక్టర్లు చెబుతున్నారు. ఈ సమస్య కారణంగా రాత్రి పడుకోలేకపోతున్నట్లుగా కూడా డాక్టర్లకు చెబుతున్నారు. చెవుల్లో ఇలా మోత వినిపించడానికి చాలా కారణాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.

కరోనా వైరస్ ముక్కు ద్వారా మొత్తం రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. అయితే, ఇప్పటివరకు ఇందుకు సంబంధించిన స్పష్టమైన రుజువు లేదు. ముక్కు మరియు చెవులు చాలా అనుసంధానించబడి ఉన్నందున, ముక్కులో ఏ ఇన్ఫెక్షన్ వస్తున్నదో, అది చెవిలోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా చెవి కణాలు దెబ్బతిని ఉంటాయి. అందువల్ల ఈ సమస్య వచ్చి ఉండచ్చునని నిపుణులు చెబుతున్నారు.

ఫైబర్స్ లేదా మ్యూకర్స్ కారణంగా, చెవిలో భారము లేదా చెవి లోపల ద్రవం ఉంటుంది. ఇది చెవుల్లో మోగుతున్నట్లు అనిపిస్తుంది. ఇవేకాకుండా, హోమ్ క్వారంటైన్, ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు చాలామంది కరోనా సోకిన హెడ్ ఫోన్‌లను చాలా రోజులు ఉపయోగించి ఉంటారని, ఇది కూడా ఓ కారణం కావచ్చునని చెబుతున్నారు. హెడ్‌ఫోన్‌లను అధికంగా వాడటం వినికిడిని ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

కరోనా నుంచి కోలుకున్నవారికి ఈ సమస్య ఉంటే, వెంటనే ఆస్పత్రిలో ENT స్పెషలిస్ట్‌లను సంప్రదించాలని, డాక్టర్లు చెబుతున్నారు. మెడిసిన్ వాడడమే కాదు.. కౌన్సెలింగ్ కూడా ఈ ఇబ్బందులకు అవసరం అని అంటున్నారు. ఈ పరిస్థితికి చివరిదశలో.. చెవి లోపల స్టెరాయిడ్లు ఇంజెక్ట్ చేయవలసి వస్తుందని కూడా అంటున్నారు డాక్టర్లు.