Indian Railways : భారతీయ రైళ్లకు ఆ పేర్లు ఎలా నిర్ణయిస్తారో తెలుసా..?

భారత్ లో అంతి పెద్ద రవాణా సంస్థ రైల్వే. భారత్ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ కూడా. అటువంటి భారతీయ రైల్వే పలు ప్రాంతాల మధ్య తిరిగే రైళ్లకు పేర్లు ఉంటాయనే విషయం తెలిసిందే. రాజధాని, శతాబ్ది, దురంతో, గరీభ్ రథ్ వంటి పేర్లు ఉంటాయి. ఈ పేర్లు ఎలా పెడతారు? ఎలా నిర్ణయిస్తారు? అనేది బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ఆ పేర్లు ఎలా పెడతారో? ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుందాం..

Indian Railways : భారతీయ రైళ్లకు ఆ పేర్లు ఎలా నిర్ణయిస్తారో తెలుసా..?

How do Indian Railways trains get their names..

Indian Railways:  భారత్ లో అంతి పెద్ద రవాణా సంస్థ రైల్వే. భారత్ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ కూడా. అటువంటి భారతీయ రైల్వే పలు ప్రాంతాల మధ్య తిరిగే రైళ్లకు పేర్లు ఉంటాయనే విషయం తెలిసిందే. రాజధాని, శతాబ్ది, దురంతో. తాజాగా వచ్చిన వందే భారత్, గరీభ్ రథ్ వంటి పేర్లు ఉంటాయి. ఈ పేర్లు ఎలా పెడతారు? ఎలా నిర్ణయిస్తారు? అనేది బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ఆ పేర్లు ఎలా పెడతారో? ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుందాం..

రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక చట్టబద్ధమైన సంస్థ అనే విషయం తెలిసిందే. ప్రయాణీకుల అవసరాల కోసం ప్రతీ రోజు వేలాది రైళ్లు లక్షలాదిమంది ప్రయాణీకులకు వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. వీటిలో చాలా రైళ్లు ప్రత్యేకమైన పేర్లుంటాయి. ఉదాహరణకు వందే భారత్, గరీభ్ రథ్ వంటివి. సాధరణంగా రైళ్లకు వాటి వాటి గమ్యస్థానాల పేర్లనే పెడుతుంటారు. మరికొన్ని రైలు ప్రయాణించే ప్రాంతాల్లో వాడుకలో ఉండే లేదా ప్రసిద్ధి చెందిన ప్రాంతాల పేర్లు కూడా పెడుతుంటారు. ఉదాహరణకు

‘శతాబ్ది ఎక్స్ ప్రెస్’ : ‘శతాబ్ది ఎక్స్ ప్రెస్’ (Shatabdi)అనేది భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 100వ జయంతి సందర్భంగా 1989లో మొదలైంది. అందుకే దీనికి శతాబ్ది అంటే వంద అని పేరు వచ్చేలా ఈ పేరు పెట్టారు. భారతీయ రైల్వే నిర్వహించే సుదూర ప్రాంత రైలు పలు సౌకర్యాలను కలిగి ఉంది.

రాజధాని ఎక్స్ ప్రెస్ : రాజధాని (Rajdhani’ఎక్స్ ప్రెస్ ..దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు నడిచే రైళ్లకు పెట్టారు. ముఖ్యంగా ఢిల్లీ నుంచి రాష్ట్రాల రాజధానుల మధ్య ఈ ‘రాజధాని ఎక్స్ ప్రెస్ ’రైళ్లు ప్రయాణిస్తుంటాయి. అందుకే రాజధాని పేరు సరిగ్గా ఉంటుందని అలా నిర్ణయించి ఆ పేరు ఖరారు చేశారు.ఇది భారతదేశంలోని టాప్-టైర్ రైళ్లలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 140 కిలోమీటర్లు. ఇది ఛార్జీలో ఆహారంతో పాటు ఎయిర్ కండిషన్డ్ సౌకర్యాలుండే రైలు.

దురంతో ఎక్స్ ప్రెస్ : ఇక దురంతో ఎక్స్ ప్రెస్ (Duronto Express)పేరును విషయానికొస్తే.. ‘దురంతో’ అంటే బెంగాలీ భాషలో అవాంతరాలు లేనిది. ఎందుకంటే ఇది తన ప్రయాణాల సమయంలో తక్కువ సంఖ్యలో స్టేషన్‌లలో ఆగుతుంది పైగా ఎక్కువ దూరాలను మాత్రమే కవర్ చేస్తుంది. దీని వేగం గరిష్టంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.

గరీబ్ రథ్ Garib rath EXpress) అంటే “పేదల రథము” అని అర్థం. ఎక్స్ ప్రెస్ రైలును తక్కువ ధరతో ఎయిర్ కండీషన్డ్ ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో 2005లో భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చింది. అప్పుడు రైల్వే మంత్రిగా రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో ఈ రైలు వచ్చింది.
ఇతర రైళ్ల ఏసీ ప్రయాణం కంటే దీనిలో కేవలం 2/3 వంతు మాత్రమే రేటు ఉంటుంది. ఇది సూపర్ ఫాస్ట్ రైళ్ల కంటే కూడా గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దగ్గర దగ్గరగా రాజధాని ఎక్స్‌ప్రెస్ వేగంతో సమానంగా ప్రయాణిస్తుంది.

హైదరాబాద్ నుంచి త్రివేండ్రమ్ మధ్య రైలుకు శబరి ఎక్స్ ప్రెస్ పేరు. శబరిమల వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు అనుకూలం. అందుకని శబరి పేరు పెట్టారు. కేరళలోని శబరిమల పేరు ఎంత ప్రఖాతమైనదో తెలిసిందే. అయ్యప్ప స్వాములు మాలలు ధరించి అయ్యప్పను దర్శించుకోవటానికి ఆ శబరి ఎక్స్ ప్రెస్ రైలు ప్రసిద్దిగాంచింది. ఇలా ప్రత్యేకమైన పేర్లు చాలా తక్కువగానే ఉంటాయి. ఎక్కువ శాతం గమ్యస్థానం పేర్లు నిర్ణయిస్తుంటారు.ఉదాహరణకు, బెంగళూరు-చెన్నై మెయిల్, పూర్ణ-హైదరాబాద్ ప్యాసింజర్, చెన్నై-జైపూర్ ఎక్స్‌ప్రెస్, హౌరా-ముంబై మెయిల్ మొదలైనవి.