ఇదీ భారతదేశ సైనిక పాటవం, రెండు నెలల్లోనే ఈ 12 క్షిపణులను పరీక్షించి.. ప్రపంచాన్నే ఆశ్చర్యపోయేలా చేసింది!

  • Published By: sreehari ,Published On : October 28, 2020 / 08:03 PM IST
ఇదీ భారతదేశ సైనిక పాటవం, రెండు నెలల్లోనే ఈ 12 క్షిపణులను పరీక్షించి.. ప్రపంచాన్నే ఆశ్చర్యపోయేలా చేసింది!

Testing 12 Missiles Within Two Months : గత రెండు నెలల కాలంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) పదుల సంఖ్యలో క్షిపణులను పరీక్షించి యావత్తూ ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటివరకూ డీఆర్డీఓ మొత్తం 12 క్షిపణులను పరీక్షించింది.

మొట్టమొదటి యాంటీ రేడియేషన్ మిస్సైల్ రుద్రమ్ నుంచి బ్రహ్మోస్ వరకు అనేక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్.. ఇలా భారత్ మొత్తంగా 12 క్షిపణులను కేవలం రెండు నెలల వ్యవధిలోనే విజయవంతంగా పరీక్షించింది.



తూర్పు లడఖ్‌లోని LAC వద్ద భారత చైనాల సరిహద్దుల మధ్య ఉద్రికత్తల కొనసాగుతుండగానే డీఆర్డీఓ ఈ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది.

1. Nag Anti-Tank Guided Missile (ATGM)
డీఆర్డీఓ అభివృద్ధి చేసిన నాగ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ATGM)కు సంబంధించి ఫైనల్ ట్రయల్ ను భారత్ అక్టోబర్ 22న విజయవంతంగా పరీక్షించింది. ఈ వెపన్ సిస్టమ్ ను భారత ఆర్మీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది.
Testing 12 Missiles Within Two Months2. Stand-off Anti-tank (SANT) Missile
ఒడిషా తీర ప్రాంతంలో ఈ క్షిపణిని DRDO అక్టోబర్ 19న విజయవంతంగా పరీక్షించింది.

భారత వైమానిక దళం కోసం ఈ క్షిపణిని డీఆర్డీఓ రూపొందించింది. సైనిక బలగాలకు SANT మిస్సైల్ అదనపు బలంగా చెప్పవచ్చు.

Testing 12 Missiles Within Two Months

3. BrahMos Supersonic Cruise Missile
సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్.. అక్టోబర్ 18న విజయవంతంగా పరీక్షించింది డీఆర్డీఓ. స్వదేశీ పరిజ్ఞానంతో భారత నేవీ రూపొందిన ఈ క్రూయిజ్ క్షిపణిని అరేబియా సముద్రంలో ఓ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని పరీక్షించారు.

డీఆర్డీఓ టార్గెట్ చేసిన లక్ష్యాన్ని అనుకున్నట్టుగానే విజయవంతంగా క్షిపణిని పరీక్షించింది.
Testing 12 Missiles Within Two Months4. Rudram-1: Anti-Radiation Missile
భారత మొట్టమొదటి స్వదేశీ యాంటీ రేడియేషన్ మిస్సైల్ (Rudram-1) కొత్త జనరేషన్‌ను IAF కోసం DRDO రూపొందించింది.

ఈ క్షిపణిని అక్టోబర్ 9న బాలాసోర్ లోని ITRలో విజయవంతంగా DRDO పరీక్షించింది.
Testing 12 Missiles Within Two Months5. SMART Torpedo System For Anti-Submarine Warfare (ASW)
DRDO స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన SMART Torpedo System ఫ్లయిట్ ద్వారా అక్టోబర్ 5న విజయంతంగా భారత్ పరీక్షించింది. యాంటీ సబ్ మెరైన్ యుద్ధ సమయాల్లో ఇది గేమ్ ఛేంజర్‌గా వినియోగించుకోవచ్చు.
Testing 12 Missiles Within Two Monthsఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెంట్ రిలీజ్ ఆఫ్ టోర్ పెడో (SMART)ను డీఆర్డీఓ విజయంతంగా పరీక్షించింది.

6. Nuclear-Capable Hypersonic Missile ‘Shaurya’
న్యూ క్లియర్ క్యాపబుల్ హైపర్ సోనిక్ మిస్సైల్ శౌర్య.. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించారు.

ఈ క్షిపణిని అక్టోబర్ 3న ఒడిశా తీరంలోని రేంజ్ నుంచి DRDO విజయవంతంగా ప్రయోగించిందని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.Testing 12 Missiles Within Two Months



భారత ల్యాండ్ వేరియంట్ K-15 క్షిపణి అయిన శౌర్యను 700 కిలోమీటర్ల స్ట్రయిక్ రేంజ్ నుంచి 1000 కిలోమీటర్ల దూరం వరకు 200కిలోల నుంచి 1000 కిలోల వరకు పేలోడ్స్ మోయగల సామర్థ్యం ఉందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.

7. Extended Range Of BrahMos Supersonic Cruise Missile
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణికి ఇది ఎక్స్‌టెండెడ్ రేంజ్ మిస్సైల్.. ఒడిశాలో సెప్టెంబర్ 30న నేల ఆధారిత ప్రాంతం నుంచి పరీక్షించారు.
Testing 12 Missiles Within Two Months8. Prithvi-II Missile
Prithvi-II క్షిపణిని ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే సామర్థ్యం గలదు.

స్వదేశీ టెక్నాలజీతో ఈ న్యూక్లియర్ కేపబుల్ క్షిపణిని రూపొందించారు. భారతదేశంలో సెప్టెంబర్ 23న రాత్రి సమయంలో విజయవంతంగా పరీక్షించారు.
Testing 12 Missiles Within Two Months9. Laser-Guided Anti-Tank Guided Missile (ATGM)
స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంకు గైడెడ్ మిస్సైల్ (ATGM) మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లో సెప్టెంబర్ 23న విజయవంతంగా పరీక్షించింది.Testing 12 Missiles Within Two Months

సుదూర లక్ష్యాలను ఛేధించే ప్రాంతమైన Armoured Corps Centre and School (ACC&S)లో KK రేంజ్‌ MBT అర్జున్ ట్యాంకు నుంచి ఈ క్షిపణిని DRDO పరీక్షించింది.



10. ABHYAS – High-speed Expendable Aerial Target (HEAT) vehicles
హైస్పీడ్ ఎక్స్ ప్యాండబుల్ ఏరియల్ టార్గెట్ లేదా హీట్ వెహికల్స్ కలిగిన ABHYAS‌ను సెప్టెంబర్ 22న భారత్ ఫ్లయిట్ ద్వారా పరీక్షించింది.

వివిధ క్షిపణి వ్యవస్థలను విశ్లేషించి లక్ష్యాలను ఛేదించేందుకు ఈ అభ్యాస్ వెహికల్స్ వినియోగించవచ్చు.

Testing 12 Missiles Within Two Months

11. Hypersonic Technology Demonstrator Vehicle (HSTDV)
భారత స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన కీలక hypersonic technology demonstrator vehicle (HSTDV) భారత రక్షణ పరిశోధన సంస్థ (DRDO) విజయవంతంగా పరీక్షించింది.

సెప్టెంబర్ 7న ఒడిశా తీరంలో శక్తివంతమైన స్ర్కామ్ జెట్ ఇంజిన్ ద్వారా ఈ క్షిపణిని ప్రయోగించింది.
Testing 12 Missiles Within Two Months12. Laser-guided Anti-Tank Guided Missile (ATGM)
స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంకు క్షిపణిని 5 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను కూడా ఛేదించగలదు.

ఈ క్షిపణిని మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లో అక్టోబర్ 1న MBT అర్జున్ ట్యాంక్ నుంచి పరీక్షించారు.
Testing 12 Missiles Within Two Months