Viral Video: స్వేచ్ఛా ప్రపంచంలోకి మూగజీవాలు.. ఈ వీడియో చూశారా.. చూస్తే వావ్ అనాల్సిందే!

అనేక జీవుల్ని చిన్న చిన్న బోన్లలో, అక్వేరియంలు లేదా ఏదైనా క్లోజ్డ్ ఎన్విరాన్‌మెంట్‌లో ఉంచి బంధిస్తారు. అవి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వాతావరణానికి అలవాడుపడతాయి. కానీ, అలాంటి జీవాల్ని స్వేచ్ఛగా వాటి ప్రపంచంలోకి వదిలేస్తే అవి పొందే ఆనందం మాటల్లో వర్ణించలేం.

Viral Video: స్వేచ్ఛా ప్రపంచంలోకి మూగజీవాలు.. ఈ వీడియో చూశారా.. చూస్తే వావ్ అనాల్సిందే!

Viral Video: అడవి జంతువులు, పక్షులు, జలచరాలు ఏవైనా సరే.. వాటి ప్రపంచంలో అవి బతకాలి. అది ప్రకృతి ధర్మం. అయితే, రకరకాల కారణాలతో కొందరు వాటిని జూలలో, ఇండ్లళ్లో బంధించి ఉంచుతారు. చిన్న చిన్న బోన్లలో, అక్వేరియంలు లేదా ఏదైనా క్లోజ్డ్ ఎన్విరాన్‌మెంట్‌లో వాటిని బంధిస్తారు.

Mumbai Rains: ముంబైలో ఆకస్మిక వానలు.. మీమ్స్‌తో రెచ్చిపోతున్న నెటిజన్లు

అవి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వాతావరణానికి అలవాడుపడతాయి. కానీ, అలాంటి జీవాల్ని స్వేచ్ఛగా వాటి ప్రపంచంలోకి వదిలేస్తే అవి పొందే ఆనందం మాటల్లో వర్ణించలేం. అలాంటి సంఘటనలు అనేకం జరుగుతుంటాయి. బోన్లలో, ఇండ్లళ్లో పెంపుడు జంతువులుగా, బంధీలుగా ఉన్న జంతువుల్ని, పక్షుల్ని, జలచరాల్ని, తప్పిపోయి వచ్చిన జీవుల్ని వాటి ఆవాసాలైన అడవులు, నదులు, సముద్రాల్లోకి వదిలేస్తుంటారు. అలా జీవుల్ని స్వేచ్ఛగా వదిలేసే వీడియోలు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో చూసే ఉంటారు.

Women’s Day: ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు

కానీ, ఒకేసారి పదుల సంఖ్యలో రకరకాల జీవుల్ని స్వేచ్ఛగా వదిలేయడం ఎప్పుడైనా చూశారా? లేదు కదూ! అయితే, ఈ వీడియో చూడండి. ఒకేసారి ఎన్ని జంతువుల్ని వాటి ప్రపంచంలోకి వదిలి పెడుతున్నారో తెలుస్తుంది. పులులు, చిరుతలు, కోతులు, పక్షులు, గుర్రాలు వంటి అనేక జీవుల్ని స్వేచ్ఛగా వదిలేస్తున్న వీడియో ఇది. అన్నింటినీ కలిపి ప్రముఖ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకు 1.4 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కాయి. ఈ వీడియో క్లిప్ చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు. కావాలంటే మీరూ చూసి ఎంజాయ్ చేయండి