Third Wave : కర్నాటక ప్రభుత్వం మాస్టర్ ప్లాన్… 1.5కోట్ల మంది పిల్లలకు టెస్టులు

కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందనే నిపుణులు హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. పిల్లలకు ప్రత్యేకించి ఇంకా వ్యాక్సిన్లు

Third Wave : కర్నాటక ప్రభుత్వం మాస్టర్ ప్లాన్… 1.5కోట్ల మంది పిల్లలకు టెస్టులు

Karnataka

Karnataka Plans To Screen : కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందనే నిపుణులు హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. పిల్లలకు ప్రత్యేకించి ఇంకా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని 1.5కోట్ల మంది పిల్లలకు టెస్టులు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆరోగ్య నందన అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. సీఎం బసవరాజ్ బొమ్మై రానున్న వారం రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ చెప్పారు.

1.5కోట్ల మంది పిల్లలకు పలు రకాల టెస్టులు చేస్తాం. అందులో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలను, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని తెలుసుకోవచ్చు. అలా గుర్తించిన పిల్లలకు వారి ఇమ్యూనిటీ పెరిగేలా పౌష్టికాహారం, సప్లిమెంట్లు ఇస్తాం. వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తాం అని మంత్రి సుధాకర్ చెప్పారు.

పిల్లలను స్కీనింగ్ చేసే విధానం
* ఆశా వర్కర్లు, అంగన్ వాడీ టీచర్ల నుంచి పిల్లల సమాచారం తీసుకుంటాం.
* ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫసర్, రాష్ట్రీయ బాల స్వస్త కార్కక్రమం మొబైల్ టీమ్.. గ్రామంలో ఎక్కడ, ఎప్పుడు హెల్త్ స్క్రీనింగ్ చేస్తారో చెబుతారు.
* పెద్ద స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లు, కళ్యాణ మండపాల్లో హెల్త్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.
* తాలుకా హెల్త్ ఆఫీసర్ వేదికను ఎంపిక చేస్తారు.

క్యాంపుల గురించి పిల్లలకు లేదా వారి తల్లిదండ్రులకు ఈ విధంగా సమాచారం ఇస్తారు…
* ఒకసారి తేదీ, వేదిక ఫిక్స్ చేసిన తర్వాత అధికారులు రంగంలోకి దిగుతారు. దానికి సంబంధించిన సమాచారాన్ని పలు మాధ్యమాల ద్వారా జనాలకు చేరవేస్తారు.
* దండోరా, పబ్లిక్ అనౌన్స్ మెంట్, లౌడ్ స్పీకర్లు వంటి వాటితో జనాలకు సమాచారం అందిస్తారు.

ఏయే హెల్త్ పారామీటర్స్ చెక్ చేసి రికార్డు చేసుకుంటారు…
* 4డీలు కవర్ చేస్తారు. లోపభూయిష్ట పుట్టుక, లోపాలు, వైకల్యం, మానసిక ఎదుగదల
* ఈ సమాచారం సేకరించిన తర్వాత ప్రభుత్వం పిల్లలను వర్గీకరిస్తుంది.
* ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ
* నిత్యం వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారు.

ప్లాన్ ఆఫ్ యాక్షన్..
* 8 నుంచి 9 మంది సిబ్బంది ఉన్న టీమ్ ని పంపుతారు.
* ఆ టీమ్ లో ఇద్దరు డాక్టర్లు, ఫార్మసిస్ట్, నేత్ర వైద్యుడు, కంటి పరీక్ష చేసే అసిస్టెంట్, పీహెచ్ సీ నుంచి మెడికల్ ఆఫీసర్, పోస్టుగ్రాడ్యుయేట్ శిశువైద్యుడు, ఎంబీబీఎస్ డాక్టరల్, స్టాఫ్ నర్సు ఉంటారు.
* హెల్త్ పారామీటర్లు చెక్ చేశాక అదే క్యాంపులో స్వల్ప చికిత్సలు ఇస్తారు. అలాగే మందులు కూడా ఇస్తారు.
* పలు రకాల వ్యాధులున్న పిల్లలకు ప్రాధాన్యత ఇచ్చి వ్యాక్సిన్ ఇస్తారు.

పిల్లలందరికి కొవిడ్ టెస్టులు చేస్తారా?
* పిల్లలందరికి కొవిడ్ టెస్టులు చేయరు
* లక్షణాలు కనిపించిన వారికి మాత్రమే కొవిడ్ టెస్టులు చేస్తారు(ఆర్టీపీసీఆర్ లేదా యాంటిజన్ టెస్ట్)
* అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేస్తారు
* డయాబెటిక్ ఉందో లేదో తెలుసుకుంటారు. డయాబెటిల్ తరహా పరిస్థితులు ఉన్నాయేమో తెలుసుకుంటారు.
* ఇలా సేకరించిన వివరాలను ప్రభుత్వం భద్రపరుస్తుంది.
* పిల్లల్లో ఎవరైనా ఇన్ ఫెక్షన్ బారిన పడితే వెంటనే వారికి చికిత్స అందించేందు ఉపయోగపడుతుంది.
* ఇతర పిల్లలకు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా చెబుతారు.
* ఈ టెస్టుల ద్వారా ఎంత మేరకు మందులు అవసరం పడతాయన్నది తెలుసుకోవచ్చని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మందులు పంపిణీ చేయొచ్చని అధికారులు తెలిపారు.
* ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని అధికారులు వివరించారు.