COVID-19ను అడ్డుకోవడానికి Royal Enfieldతో మహిళా పోలీసులు

COVID-19ను అడ్డుకోవడానికి Royal Enfieldతో మహిళా పోలీసులు

కేరళలోని త్రిస్సూర్ లో త్వరలోనే కొవిడ్ 19 బైక్ పాట్రోలింగ్ యూనిట్లు వెలవనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకానున్న ఈ యూనిట్లు కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయని నమ్ముతున్నారు. క్వారంటైన్ సెంటర్లు పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో మహిళా అధికారులను నియమిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు, సోషల్ డిస్టెన్సింగ్ ఉల్లంఘించేవారిని అదుపుచేసే పనులు చూసుకుంటారు.

ఏప్రిల్ నుంచి ప్రత్యేక మహిళ బైక్ స్క్వాడ్ కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ పర్యవేక్షిస్తూ ఉంది. వీరందరికీ కలర్ కోడెడ్ హెల్మెట్స్ తో పాటు లాక్ డౌన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బాధ్యతలు అప్పగిస్తారు. సీనియర్ సిటిజన్లు, మహిళలు, పిల్లలను చూసుకోవడం వీరి బాధ్యత. కేరళ పోలీసుల జనమైత్రి సురక్ష ప్రొజెక్ట్ లో భాగంగా ఈ కొత్త టీం సిద్ధమైంది. పబ్లిక్, పోలీసుల మధ్య గ్యాప్ పూర్తి చేయడం కోసమే దీనిని లాంచ్ చేశారు.

కరోనా మహమ్మారితో పోరాడటానికి మహిళా ఆఫీసర్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నారని రాష్ట్ర డీజీపీ లోక్‌నాథ్ బెహరా చెప్పారు. ‘డేర్ డెవిల్ రైడర్స్ మహిళల సత్తా ఏంటో చూపించారు. ప్రజలతో తరచూ టచ్ లో ఉంటున్నారు. క్వారంటైన్ గురించి వారిలో కాన్ఫిడెన్స్ పెంచడం గురించి చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో రూల్స్ పాటించని వారి పట్ల సీరియస్ గా ఉంటున్నారు. కొద్ది రోజుల్లోనే చాలా కేసులు నమోదు చేశారు. పరిస్థితిని జాగ్రత్తగా హుందాతనంగా హ్యాండిల్ చేస్తున్నారని డీజీపీ అంటున్నారు.

కొవిడ్ 19ను అడ్డుకోవడానికి కేరళ పోలీసులు ఇతర జిల్లాల్లోనూ ఈ బృందాలను ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.