కరోనా వైరస్ ఏ వస్తువులపై ఎన్ని రోజలు ఉంటుందో తెలుసా?

  • Published By: veegamteam ,Published On : April 1, 2020 / 05:58 AM IST
కరోనా వైరస్ ఏ వస్తువులపై ఎన్ని రోజలు ఉంటుందో తెలుసా?

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ వినబడితే చాలు ప్రజలందరూ భయపడిపోతున్నారు. కరోనా వైరస్ అనేది ఏ వస్తువులపై ఎన్ని రోజులు ఉంటాయి అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. అంతేకాకుండా బట్టల పై కూడా వైరస్ ఉంటుందా అనే ప్రశ్నలు మనల్ని కలవర పెడుతుంటాయి. 

ఈ వైరస్ ఏ వస్తువు పై  ఎంతకాలం ఉంటుందనే దాని గురించి తెలుసుకుందాం..

ఈ వైరస్ ప్లాస్టిక్, స్టీల్, కాపర్, కార్డు బోర్డు, గాలిలో  ఎన్ని రోజులు, ఎంత సమయం ఉంటుందనే దాని పై కొన్ని పరిశోధనలు జరిగాయి. కాని ఇంకా ఎవరూ ఫాబ్రిక్(దుస్తులు) పై పరిశోధనలు జరపలేదు. కానీ ఈ వైరస్ అనేది కార్డు బోర్డు వంటి వాటి కంటే స్టీల్ పైన ఎక్కువ రోజలు ఉంటుందనే కొన్ని పరిశోధనల ద్వారా తెలుస్తుంది. ప్లాస్టిక్, స్టీల్ వాటిపై 3 రోజలు పాటు ఉంటుంది. కార్డు బోర్డు, కాపర్, గాలి పై 3 నుంచి 4 గంటల పాటు ఈ వైరస్ జీవించి ఉంటుంది.

డిటర్జెంట్లకు వైరస్ ని చంపగల శక్తి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ తెలిపింది. అందుకే ఎలాంటి వైరస్ రాకుండా ఉండటం కోసం బట్టలను రోజు శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా 60 నుంచి 90 డిగ్రీ సెల్సియస్ వద్ద బట్టలను శుభ్రం చేయటం మంచిదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి బట్టలను వేరుగా శుభ్రం చేయటం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆ తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాని ప్రత్యేకంగా బట్టలపై ఈ వైరస్ ఎన్ని గంటలు, రోజులు ఉంటుందనే దానిపై స్పష్టం చేయలేదు. క్లాత్ తో తయారు చేసిన మాస్కులను వాడుతుంటే మాత్రం వాటిని రోజు శుభ్రం చేసుకోవటం మంచిదని తెలిపింది. 

దేశవ్యాప్తంగా 1619 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 46 మంది మరణించారు. ఇప్పటివరకు 142 మంది కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 8. 57 లక్షల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 42, 100 మంది మరణించారు.