కరోనాపై పోరాటానికి భారత్‌కి ఎన్ని మాస్క్‌లు అవసరమంటే?

  • Published By: veegamteam ,Published On : March 30, 2020 / 09:14 AM IST
కరోనాపై పోరాటానికి భారత్‌కి ఎన్ని మాస్క్‌లు అవసరమంటే?

కరోనా వైరస్ రోజురోజుకి మరింత వ్యాప్తి చెందుతుండటంతో భారత్ లో కూడా మరణాల సంఖ్య పెరిగిపోతుంది. కానీ పెరిగిపోతున్న కేసులకు చికిత్స చేయడానికి వైద్య పరికరాలు సరిపోవట్లేదు. ముఖ్యంగా మాస్కుల కొరత పెరిగిపోయింది. అందుకని భారత్ కు 3.8మిలియన్ల మాస్కులు అవసరమనీ కేంద్ర ప్రభుత్వం వందల కంపెనీలను కోరింది.

అంతే కాకుండా 6.2 మిలియన్ వ్యక్తిగత సంరక్షణ పరికరాలు అవసరం పడతాయని తెలిపింది. ఇకపోతే పాజిటివ్ కేసులు పెరుగుతున్న కొద్ది మాస్కులకు డిమాండ్ పెరిగిపోతుంది. దీంతో హెల్త్ వర్కర్లు మాస్కులు ధరించకపోవటం ఆందోళన కలిగిస్తోంది. 

మార్చి 27న ఇన్వెస్ట్ ఇండియా ఏజెన్సీ అనే సంస్థ దాదాపు 730 కంపెనీలను ఆశ్రయించి మాస్కులు, వెంటిలేటర్లు, ICU మానిటర్లు అందజేయాలని కోరినట్టు తెలిపింది. అయితే ఇప్పటివరకు 319 కంపెనీలు రెస్పాన్డ్ అయ్యాయి. మిగతా కంపెనీలు రెస్పాన్డ్ అవ్వలేదని తెలిపింది.

ప్రస్తుతం అందుబాటులో 9.1మిలియన్ల మాస్కులు ఉన్నాయని ఇన్వెస్ట్ ఇండియా ఏజెన్సీ చెబుతోంది. కానీ, అవి చాలవని ఇంకా మాస్కులు కావాలని కోరింది. అంతేకాదు ఈ సంస్థ భారత్‌లోని ప్రైవేట్ కంపెనీలతో పాటు దక్షిణ కొరియా సంస్థల నుంచి కూడా కొన్ని టెస్టు కిట్స్‌ను దిగుమతి చేసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.