ఇంకెంతమంది అమ్మాయిలు.. ఇంకెన్ని హత్రాస్ ఘటనలు: రాహుల్ గాంధీ

ఇంకెంతమంది అమ్మాయిలు.. ఇంకెన్ని హత్రాస్ ఘటనలు: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ లీడర్ RAHUL GANDHI ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. యూపీలో హత్రాస్ వంటి ఘటనలు ఇంకెన్ని జరుగుతాయి. ఇంకెంత మంది అమ్మాయిలు బలైపోవాలని ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్ ను ట్విట్టర్ లో ప్రశ్నించారు. దాంతో పాటు మరో దళిత బాలిక రేప్ ఘటనను ట్యాగ్ చేశారు.

బారబంకీ గ్రామంలో రేప్, హత్య చేసి ఆ కేసును కవర్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్.. యూపీ ప్రభుత్వం రేప్ లు జరగకుండా అడ్డుకోలేకపోతుంది. బాలిక కుటుంబానికి న్యాయం చేయకుండా మరోసారి నిందితుడ్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది.



‘ఇంకెంత మంది బాలికలు. ఇంకెన్ని హత్రాస్ ఘటనలు’ అని హిందీలో ట్వీట్ చేశారు. దళిత బాలికపై హత్రాస్ లో జరిగిన ఘటనతో కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తుంది. నలుగురు కలిసి చేసిన గ్యాంగ్ రేప్ కారణంగా గాయాలతో సతమతమవుతూ హాస్పిటల్ లోనే ట్రీట్ మెంట్ తీసుకుంటూ కన్నుమూసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీనిపై యోగి ప్రభుత్వం పలు విమర్శలు ఎదుర్కొంటుంది. స్థానిక పోలీసులు యువతి మృతదేహానికి అర్ధరాత్రి అర్థాంతరంగా అంత్యక్రియలు ముగించేయడం పట్ల ఆరోపణలకు బలం పుంజుకున్నట్లయింది. అధికారులు అంత్యక్రియలు కుటుంబ సభ్యుల సమ్మతి మేరకే జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) హ్యాండిల్ చేస్తుంది.