Covid-19: కోవిడ్ టీకా.. ఎంత‌మంది చ‌నిపోయారు.. ఇదీ తాజా లెక్క‌

భారత్ లో గత ఐదున్నర నెలల నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇక ఇప్పటివరకు 25 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఇచ్చారు.

Covid-19: కోవిడ్ టీకా.. ఎంత‌మంది చ‌నిపోయారు.. ఇదీ తాజా లెక్క‌

Corona vaccine: భారత్ లో ఐదున్నర నెలలగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది. ఇక ఇప్పటి వరకు దేశంలో 25 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ కారణంగా దుష్ప్రభావాలు, మరణాలకు సంబదించిన డేటాను కేంద్ర ప్రభుత్వ విడుదల చేసింది.

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దుష్ప్ర‌భావాలు కలిగిన వారి సంఖ్య 26200 ఉందని పేర్కొన్నారు. ఈ డేటా ప్రకారం 0.01 శాతం మందిపై మాత్రమే వ్యాక్సిన్ ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలిపారు. ఇక వ్యాక్సిన్ వికటించి మరణించిన వారిసంఖ్య 488గా ఉందని పేర్కొన్నారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ప్రతి పదిలక్షల మందిలో ఒకరు మరణించారగా ప్రతి పదివేల మందిలో ఒకరికి మాత్రమే అనారోగ్య సమస్యలు తలెత్తాయని వివరించారు. ఇక వ్యాక్సిన్ విషయమై నిపుణులు మాట్లాడుతూ వ్యాక్సిన్ ప్రజలకు మేలు చేస్తుందని, వ్యాక్సిన్ వలన కలిగిన దుష్ప్రభావాలు చాలా తక్కువ అని తెలిపారు.

Read:Corona Vaccine Wastage: కోవిడ్‌ టీకా డోస్‌ల వృథాలో జార్ఖండ్‌ టాప్‌