Walking Benefits పావుగంట నడిస్తే ఎన్ని ప్రయోజనాలో..

నడక ప్రతీ మనిషికి చక్కటి వ్యాయామం. నడక వల్ల ఎన్ని ఉపయోగాలో తెలిస్తే వెంటనే ప్రారంభిస్తారు. రోజుకు కనీసం 15నిమిషాల నడకతో చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

Walking Benefits పావుగంట నడిస్తే ఎన్ని ప్రయోజనాలో..

Walking Benefits

walking Benefits : నడక ప్రతీ మనిషికి చక్కటి వ్యాయామం. నడక వల్ల ఎన్ని ఉపయోగాలో తెలిస్తే వెంటనే ప్రారంభిస్తారు. గంటల తరబడి నడిచేయనక్కరలేదు. రోజుకు కనీసం 15నిమిషాల నడకతో చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అసలు నడక వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజుల్లో ప్రతీవారికి ఉంది. అలా నడక ప్రారంభించి కొన్ని రోజులు అయ్యాక మీకే తెలుస్తుంది. కేవలం 15నిమిషాలు నడిస్తే ఇన్ని లాభాలుంటాయా? అని.. మరి నడక వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోండీ..

నడక మంచి ఆనందాన్నిస్తుంది. శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. అమెరికన్ జర్నల్ ప్రచురించిన దాని ప్రకారం 15నిమిషాల నడక మీలో కొత్త శక్తిని రగిలింపజేసి ఆనందాన్ని అందిస్తుంది. అంతేకాదు వక్రియ మెరుగుపడేలా చేస్తుంది. కేవలం 15నిమిషాల నడక వల్ల జీవక్రియ సంబంధ ఇబ్బందులు 29శాతం తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది.

నడక జీవితకాలాన్ని పెంచుతుంది..
ప్రతీ రోజు క్రమం తప్పకుండా 15 నిమిషాలు నడిస్తే..మీ జీవితకాలాన్ని పెంచుతుంది. పరుగులాంటి నడక మీ జీవిత పరుగును మరింత పెంచుతుంది. శరీరానికి శక్తినిస్తుంది. బద్దకాన్ని పారద్రోలి కొత్త ఉత్సాహాన్నిస్తుంది.

మంచి నిద్రకు మంచి అలవాటు నడక
మనం ప్రతీ రోజు నిద్రపోతాం. కానీ మొద్దు నిద్ర అనారోగ్యానికి కారణమైతే..సుఖ నిద్ర ఆరోగ్యానికి కారణమవుతుంది.అలా ప్రతీరోజు నడిస్తే సుఖ నిద్ర వస్తుంది.తద్వారా మంచి నిద్రతో మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. 15నిమిషాల నడక మంచిగా నిద్ర పట్టటానికి ఉపయోగపడుతుంది. మరి ఈ విషయం తెలిసాక నిద్ర నుంచి లేవటానికి ఉదయం అరగంట ఎక్కువ నిద్రపోయి వాకింగ్ కి వెళ్ళకుండా మరుసటిరోజు నిద్రను దూరం చేసుకుంటారా అన్నది మీరే నిర్ణయం తీసుకోవాలి.

నడకతో మెదడుకి ఆరోగ్యం..
నడక వల్ల రక్తప్రసరణ పనితీరు బాగుంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. దానివల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు చిన్న చిన్న నొప్పులు కూడా నడక వల్ల తగ్గిపోతాయి. ముఖ్యంగా నడుము నొప్పికి నడకే మంచిది అంటున్నారు నిపుణులు. నడము నొప్పులే కాదు చిన్న చిన్న శరీర నొప్పుల్ని కూడా నడక ద్వారా దూరం చేసుకోవచ్చు. ఉదయం లేవగానే 15నిమిషాల పాటు నడవండి. కొద్దిరోజుల్లో తేడా మీకే తెలుస్తుంది. మరి బద్దకాన్ని వదలండి నడవండి..ఉత్సాహంగా ఉండండీ..