Navjot Singh Sidhu: పటియాలా సెంట్రల్ జైల్‌లో సిద్ధూకు కల్పించిన వసతులు ఏమిటో తెలుసా?

ముప్పైఏళ్ల క్రితం కేసులో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు విధిస్తూ సుప్రింకోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఆరోగ్య కారణాల రిత్యా కోర్టులో లొంగిపోయేందుకు తనకు రెండు వారాల సమయం ఇవ్వాలని సిద్ధూ తరపు న్యాయవాది...

Navjot Singh Sidhu: పటియాలా సెంట్రల్ జైల్‌లో సిద్ధూకు కల్పించిన వసతులు ఏమిటో తెలుసా?

Navjot Singh Sidhu (1)

Navjot Singh Sidhu: ముప్పైఏళ్ల క్రితం కేసులో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు విధిస్తూ సుప్రింకోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఆరోగ్య కారణాల రిత్యా కోర్టులో లొంగిపోయేందుకు తనకు రెండు వారాల సమయం ఇవ్వాలని సిద్ధూ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే న్యాయస్థానం అందుకు ఒప్పుకోకపోవడంతో సుప్రింకోర్టు తీర్పు మేరకు శుక్రవారం సిద్ధూ పటియాలా కోర్టులో లొంగిపోయారు. మెజిస్ట్రేట్ ముందు లొంగిపోయిన తర్వాత నిబంధనల ప్రకారం సిద్ధూకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఛాతిలో నొప్పి వచ్చినట్లు అనిపించడంతో ఆయ‌న్ను మాతా కౌస‌ల్య ఆస్ప‌త్రికి పోలీసులు తీసుకెళ్లి చికిత్స ఇప్పించారు. అనంతరం జైలుకు తీసుకొచ్చారు.

Navjot Sidhu: సంవత్సరం జైలు శిక్ష విధించిన సుప్రీం, స్వతహాగా లొంగిపోయిన సిద్ధూ

పటియాలా జైలులోకి అడుగుపెట్టిన సిద్ధూకు అక్కడి అధికారులు ప్రత్యేక మర్యాదలు చేశారు. సిద్ధూకు ఖైదీ నెంబర్ 241383 ఇచ్చారు. బ్యారక్ నెంబర్ 7ను సిద్ధూకు కేటాయించారు. జైలులో సిద్ధూకు ఓ టేబుల్, రెండు టర్బన్లు, ఓ కప్ బోర్డు, బ్లాంకెట్, రెండు టవల్స్, దోమ తెర, ఓ పెన్ను, నోట్ బుక్, షూలు, రెండు బెడ్ షీట్స్, నాలుగు జతల కుర్తా పైజామా సిద్ధూకు ఇచ్చారు. అయితే సిద్ధూ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని జైలు అధికారులు పేర్కొంటున్నారు.

Crime news: హైదరాబాద్ పరువు హత్య కేసులో పురోగతి..

జైలు మాన్యువల్ ప్రకారం సిద్ధూకు శుక్రవారం రాత్రి 7.15 గంటలకు పప్పు, రోటీ ఇచ్చినట్లు సమాచారం. అయితే అనారోగ్యం కారణాలతో ఆయన దానిని తిరస్కరించారు. అతను కేవలం సలాడ్, కొన్ని పండ్లు మాత్రమే తీసుకున్నట్లు జైలు సిబ్బంది ద్వారా తెలిసింది. తనకు గోధుమలు కావడంతో పాటు కాలేయ సమస్య ఉన్నందున ప్రత్యేక ఆహారం అందించేలా చూడాలని సిద్ధూ కోరారని, చాలా కాలంగా రోటీ తినడం లేదని సిద్ధూ మీడియా సలహాదారు సురీందర్ డల్లా తెలిపారు. అందుకే ప్రత్యేక డైట్‌ తీసుకోవాలని కోరారు. నిన్న వైద్య పరీక్షల సమయంలో కూడా సిద్ధూ అదే గురించి సమాచారం ఇచ్చాడని సురీందర్ చెప్పారు.