Cyclone Jawad : జొవాద్ తుఫాన్ బలమెంత..? గులాబ్ కంటే ఎక్కువ.. తిత్లీ కన్నా తక్కువ!

జొవాద్ తుఫాన్ దూసుకొస్తోంది. భారత తూర్పుతీరం వైపుగా పయనిస్తోంది. ఆదివారం నాటికి ఆంధ్రప్రదేశ్-ఒడిశా సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది.

Cyclone Jawad : జొవాద్ తుఫాన్ బలమెంత..? గులాబ్ కంటే ఎక్కువ.. తిత్లీ కన్నా తక్కువ!

How Strong Is Cyclone Jawad 'more Than Gulaab, But Less Than Titli'

Cyclone Jawad : జొవాద్ తుఫాన్ దూసుకొస్తోంది. భారత తూర్పుతీరం వైపుగా పయనిస్తోంది. ఆదివారం నాటికి ఆంధ్రప్రదేశ్-ఒడిశా సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రపై జొవాద్ తుఫాన్ (Cyclone Jawad) ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. జొవాద్ ప్రభావం ఎక్కువగా ఉండే తీర ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. 100 కిలో మీటర్లకు పైగా వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి తుఫాన్ పయనించనుంది. ఆ సమయంలో తీరంలో 90కిలోమీటర్ల వేగంతో గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరిస్తోంది.

 ‘జొవాద్’ అనే పేరు ఎలా వచ్చిందంటే..?
జొవాద్ తుఫాన్ అనేది.. సౌదీ అరేబియా నుంచి వచ్చింది.. అంటే.. ఉదారమైనదని అర్థం. ఇంతకీ ఈ జొవాద్ ఎంత బలమైనదంటే.. గులబ్ తుఫాన్ కంటే జొవాద్ తుఫాన్ తీవ్రత అత్యంత ప్రభావంతమైనదని డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. ‘గులాబ్ సే జ్యాదా (Gulaab se zyada), తిత్లీ సే కమ్ (Titli se kam)’ అని మృత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు. గులాబ్ కంటే బలమైనదే అయినప్పటికీ తిత్లీ తుఫాన్ కంటే తీవ్రత తక్కువేనని ఆయన వివరించారు. 2021 సెప్టెంబరులో వచ్చిన గులాబ్ తుఫాను ప్రభావంతో.. ఈ ఏడాదిలో గరిష్టంగా 85కిలోమీటర్ట వేగంతో గాలులు వీచాయి. 2018 అక్టోబర్ వచ్చిన తిత్లీ తుఫాను గరిష్టంగా 140కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.. అంటే.. జొవాద్ తుఫాన్.. గులాబ్ కంటే కొంచెం ఎక్కువనే ఉంటుందని ఆయన అన్నారు. ఖచ్చితంగా తిత్లీ కంటే తక్కువగానే ఉంటుందని మహాపాత్ర మీడియా సమావేశంలో వెల్లడించారు.

పశ్చిమ బెంగాల్‌లో రెండేళ్ల క్రితం.. బుల్బుల్ (Bulbul) అనే తుఫాను ప్రభావంతో 120 కి.మీ వేగంతో గాలులు వీచాయి. జొవాద్ తుఫాన్ పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే సరికి బలహీనపడే అవకాశం ఉంది. ఫలితంగా గాలి వేగం గంటకు 60-70 కి.మీ వీచే అవకాశం ఉందన్నారు. జొవాద్ అనేది ఫణి (Phani), హుద్‌హుద్ (Hudhud) లేదా ఫిలిన్ (Phylin) వంటి అత్యంత తీవ్రమైన తుఫాను కాదని ఆయన చెప్పారు. ప్రస్తుతం.. ఇది తీవ్రమైన తుఫానుగా తీరానికి సమీపంలో గంటకు 90-100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని భావిస్తున్నామని మహాపాత్ర పేర్కొన్నారు. సాధారణంగా అన్ని తుఫానులు పెను తుఫాన్‌గా ఉండవన్నారు. తీవ్రమైన నుంచి చాలా తీవ్రమైన తుఫాన్‌లుగా తీవ్రరూపం దాల్చుతాయని చెప్పారు. కానీ, శాటిలైట్ ఫొటోల సాయంతో తుఫాన్ ప్రభావిత కేంద్రాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. బోయ్ (buoy) డివైజ్ పరిశీలనలు, తీర ప్రాంత పరిశీలనలు, స్ట్రాటోమీటర్లు, సముద్ర ఉపరితల గాలులను గమనిస్తునే ఉన్నామని తెలిపారు.

తీరం వెంబడి ఉండే అన్ని డాప్లర్ రాడార్లు జొవాద్ తుఫాన్ తీవ్రతను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తునే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఉష్ణమండల తుఫానుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఐదు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలలో (RSMC)లో IMD ఒకటి. వీటిలో ప్రతి వాతావరణ కేంద్రానికి WMO ద్వారా కేటాయించిన భౌగోళిక ప్రాంతాలకు సలహాలు సూచనలను జారీ చేస్తుంటుంది. ఈ IMD మొత్తం హిందూ మహాసముద్ర సరిహద్దు దేశాలతో పాటు 13 సభ్య దేశాలకు ఉష్ణమండల తుఫానులకు సంబంధించి సూచనలను అందిస్తుంటుంది. అందులో భారత్ సహా బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యూఏఈ యెమెన్ వంటి దేశాలు ఉన్నాయి. దశాబ్దం క్రితం ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ ప్రకారమే తుఫానులకు పేర్లు పెడుతున్నారు.
Read Also :  Jawad Cyclone : ఉత్తరాంధ్రపై జొవాద్ తుపాను ప్రభావం.. అతి భారీ వర్షాలు..తీర ప్రాంతాల్లో హైఅలర్ట్