Viral Pic : ఇడ్లీలు గుండ్రంగానే ఉండాలా ? ఐస్ క్రీమ్‌‌లా ఉండకూడదా ?

బెంగళూరుకు చెందిన ఓ రెస్టాంట్ వారు ఇడ్లీలను ఐస్ క్రీమ్ ఆకారంలో తయారు చేశారు. అచ్చం ఐస్ క్రీం పుల్లలా కనిపిస్తున్నాయి.

Viral Pic : ఇడ్లీలు గుండ్రంగానే ఉండాలా ? ఐస్ క్రీమ్‌‌లా ఉండకూడదా ?

Idly

Bangalore Ice Cream Idli : టిఫిన్ లలో ఎన్నో వెరైటీలు ఉంటాయి. అందులో ఇడ్లీ కూడా ఒకటి. చాలా మంది దీనినే ఇష్టంగా తింటుంటారు. మొదటి ఇడ్లీ తిన్న తర్వాతే..మరేదైనా ? అని సాంబార్, చట్నీతో తింటుంటారు. చాలా మంది ఇడ్లీలను రకరకాలుగా వేస్తుంటారు. ఎంతమంది వేసినా గుండ్రంగానే ఉంటాయి. కానీ..ఓ రెస్టారెంట్ వినూత్నంగా ఆలోచించింది.

Read More : Kiran Kumar Reddy : మోసగాడు చిక్కాడు.. తిరుపతిలో పట్టుకున్న తెలంగాణ పోలీసులు

అందరూ వేసినట్లు గుండ్రంగానే ఉండాలా ? అని అనుకున్నారు. కొత్త రకం ఇడ్లీలను తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు వావ్ ఏమి తెలివి ? రుచి ఎలా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకొనేందుకు రెస్టారెంట్స్ వారు వినూత్నంగా ప్రయత్నిస్తుంటారు. రెస్టారెంట్ పేరు మొదలుకుని వంటకాల వరకు వెరైటీగా ఉంటాయి.

Read More : Bathukamma 2021 : అక్టోబర్ 02 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ…మరింత కొత్తగా, 30 డిజైన్లు

బెంగళూరుకు చెందిన ఓ రెస్టాంట్ వారు ఇడ్లీలను ఐస్ క్రీమ్ ఆకారంలో తయారు చేశారు. అచ్చం ఐస్ క్రీం పుల్లలా కనిపిస్తున్నాయి. ఇడ్లీ పిండికి ఐస్ క్రీమ్ పుల్లను జోడించి..పుల్ల ఐస్ రూపంలో తయారు చేశారు. ఈ వెరైటీ ఇడ్లీలను కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రెస్టారెంట్ నిర్వాహకుల క్రియేటివిటీకి హాట్సాఫ్ అంటున్నారు. పుల్ల ఐస్ ఇడ్లీలు కావాలంటే..బెంగళూరుకు వెళ్లాల్సిందే.