ఎకానమీ నాశనం…కరోనా కేసులని పెంచడం : కేంద్రంపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 19, 2020 / 08:58 PM IST
ఎకానమీ నాశనం…కరోనా కేసులని పెంచడం : కేంద్రంపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

“How To Destroy An Economy”: Rahul Gandhi మోడీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని రాహుల్ ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందన్నారు. కేంద్రం అసమర్థత వల్ల కరోనా మరణాలు, జీడీపీ వృద్ధిలో ఆసియా దేశాల్లోనే భారత్ అట్టడుగున నిలిచిందని రాహుల్ విమర్శించారు. కొవిడ్ మరణాలు, జీడీపీ వృద్ధిలో చివరకు బంగ్లాదేశ్, పాకిస్థాన్ కన్నా కూడా భారత్​ వెనుకబడి అట్టడుగు స్థానంలో నిలిచిందని ట్వీట్​ చేశారు.



అంతర్జాతీయ ధ్రవ్యనిధి(IMF) గణాంకాల ఆధారంగా 2020 ఏడాదికి గాను దేశాల జీడీపీ వృద్ధి, ప్రతి 10 లక్షల మందిలో సంభవించిన కరోనా మరణాల వివరాలను ట్విట్టర్ లో షేర్ చేశారు రాహుల్. ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడం, అత్యంత వేగంగా కరోనా కేసుల సంఖ్య పెంచడం ఎలానో చూడండి అంటూ తన ట్వీట్ లో రాహుల్ పేర్కొన్నారు.

IMF వివరాల ప్రకారం 2020లో భారత జీడీపీ వృద్ధి మైనస్​ 10.3గా ఉంది. దేశంలో ప్రతి 10 లక్షల మందికి 83మంది కరోనాతో మరణిస్తున్నారు. ఆసియా దేశాల్లో భారత్ అట్టడుగున నిలిచింది. బంగ్లాదేశ్, చైనా, పాకిస్థాన్ వంటి దేశాలు భారత్​ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి.



నిపుణులు చేసిన హెచ్చరికలను మోడీ సర్కార్ పట్టించుకోలేదని…దాంతో దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చినట్లు రాహుల గాంధీ ఆరోపించారు. మరోవైపు,డేటాని తిరస్కరించే పనిలో కేంద్రం ఉండొద్దని…పొరపాట్లు జరగుతుంటాయని…వాటిని సరిదిద్దుకొని..సరైన చర్యలు తీసుకోవాలని..దేశంలో అందుబాటులో ఉన్న టాలెంట్ ను, అనుభవజ్ణతను వాడుకొని ముందుకు సాగాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖకు ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన కౌశిక్ బసు ఇవాళ ఓ ట్వీట్ లో తెలిపారు.