Madhya Pradesh: పోకిరి మూవీలాగా మహిళా కానిస్టేబుల్ అండర్ కవర్ ఆపరేషన్.. ఎందుకంటే

పోకిరి మూవీలోలాగా అండర్ కవర్ ఆపరేషన్ చేసింది ఒక మహిళా కానిస్టేబుల్. అయితే, మాఫియా కోసం కాదు. ర్యాగింగ్ ఆట కట్టించేందుకు కాలేజీలో చేరింది. విద్యార్థిలా నమ్మించింది. ర్యాగింగ్ గురించిన అన్ని వివరాలు సేకరించింది.

Madhya Pradesh: పోకిరి మూవీలాగా మహిళా కానిస్టేబుల్ అండర్ కవర్ ఆపరేషన్.. ఎందుకంటే

Madhya Pradesh: పోకిరి మూవీలో అండర్ వరల్డ్ మాఫియాను అరికట్టేందుకు హీరో అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహిస్తాడు. హీరో మాఫియా గ్రూపులో చేరి, వారి ఆట కట్టిస్తాడు. ఇప్పుడు ఒక మహిళా కానిస్టేబుల్ కూడా అలాంటి పనే చేసింది. అయితే.. అండర్ వరల్డ్ మాఫియా కోసం కాదు. ర్యాగింగ్ కేసు చేధించేందుకు స్టూడెంట్‌గా మారింది.

Viral Video: సింహాలతో అడుకుంటున్న బాలుడు.. చెయ్యి ఎలా కొరికిందో చూడండి.. వీడియో వైరల్

0మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పట్టణంలో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీలో చాలా కాలం నుంచి ర్యాగింగ్ జరుగుతోంది. ఈ విషయంపై పోలీసులకు పలు ఫిర్యాదులు వచ్చాయి. అయితే, ఎవరూ నిందితుల పేర్లు చెప్పేందుకు ఇష్టపడలేదు. ర్యాగింగ్ చాలా భయంకరంగా ఉన్నప్పటికీ బాధిత విద్యార్థులు పూర్తి వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. పోలీసులు వెళ్లి వారికి ధైర్యం చెప్పినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసినా స్పందించలేదు. దీంతో ర్యాగింగ్ అంశం పోలీసులకు ఒక సవాలుగా మారింది. ఈ కేసులో నిందితుల్ని పట్టుకోవాలి అనుకున్నారు. బాధిత విద్యార్థులకు ర్యాగింగ్ నుంచి విముక్తి కల్పించాలి అనుకున్నారు. ఇందుకోసం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమవ్వడంతో చివరకు అండర్ కవర్ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. షాలిని చౌహాన్ అనే 24 ఏళ్ల కానిస్టేబుల్‌ను క్యాంపస్‌కు, కాలేజీకి స్టూడెంట్‌గా పంపించాలని ఇన్‌స్పెక్టర్ సహా ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Sabarimala: శబరిమలకు ఒక్క రోజే లక్ష మంది భక్తులు.. పెరిగిన రద్దీపై సీఎం విజయన్ సమీక్ష

దీనికి షాలిని కూడా అంగీకరించింది. అంతే.. ఆ రోజు నుంచి కాలేజీలో చేరింది. తర్వాత నుంచి రోజూ విద్యార్థిలాగే ఉంటూ వచ్చింది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా తను స్టూడెంట్ అని నమ్మించింది. అందరు స్టూడెంట్స్‌కు దగ్గరైంది. ఆమె నిజంగానే విద్యార్థి అని నమ్మిన మిగతా స్టూడెంట్స్ తనతో అన్ని వివరాలు షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నిందితుల గురించి పూర్తి ఆధారాలు సేకరించింది షాలిని. ఆ ఆధారాలతో నిందితుల్ని కాలేజీ నుంచి సస్పెండ్ అయ్యేలా చేసింది. అలా షాలిని మొత్తం మూడు నెలలపాటు విద్యార్థిగా నమ్మించింది. ర్యాగింగ్ నిందితుల్ని చాకచక్యంగా పట్టుకుంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఆమెను అభినందించారు. ఆమె విద్యార్థిలా, తక్కువ వయసున్నట్లు కనిపించడం కూడా ఆమెకు ప్లస్ అయింది. కాగా, తాను ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉన్నానని, ఇది తనకో మంచి అనుభవమని షాలిని చెప్పింది.