Jupiter’s Moon : చందమామపై నీటి ఆవిరి

గురుగ్రహం చందమామ ‘గానీమీడ్’ వాతావరణంలో నీటి ఆవిరి ఉనికిని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన హబుల్ టెలిస్కోపు డేటాను అందించింది. తాజాగా, పాత డేటాను విశ్లేషించి..నీటి ఆవిరి ఉనికిని గుర్తించారు.

Jupiter’s Moon : చందమామపై నీటి ఆవిరి

Moon

Hubble Finds Water Vapor : గురుగ్రహం చందమామ ‘గానీమీడ్’ వాతావరణంలో నీటి ఆవిరి ఉనికిని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన హబుల్ టెలిస్కోపు డేటాను అందించింది. తాజాగా, పాత డేటాను విశ్లేషించి..నీటి ఆవిరి ఉనికిని గుర్తించారు. ఈ ఉపగ్రహ ఉపరితలం మీదున్న ఐసు..ఘనరూపం నుంచి నేరుగా వాయురూపంలోకి మారినప్పుడు నీటి ఆవిరి ఏర్పడుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మంచు స్వల్ప పరిణామంలో నీటి అణువులను ఆవిరి రూపంలో విడుదల చేస్తున్నట్లు గుర్తించారు.

Read More : Ambulance : ఆగిన చంటిబిడ్డ గుండె..ఆయువునిచ్చిన 108 సిబ్బంది

గానీమేడ్ వాతావరణంలో అటామిక్ ఆక్సిజన్ (O) పెద్దగా లేదని, మాలిక్యులర్ ఆక్సిజన్ (O2) మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. మంచు ఉపరితలంపై ఆవేశిత రేణువులు క్షీణించినప్పుడు ఇది ఉత్పత్తవుతోందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఇక గానీమీడ్ విషయానికి వస్తే..చందమామలన్నింటిలోకి గానీమీడ్ అతిపెద్దది. గానీమీడ్ ఉపరితలానికి సుమారు 160 కిలోమీటర్ల కింద మహాసముద్రం ఉంది. అందువల్ల అక్కడి
వాతావరణంలోని నీటి ఆవిరి..ఆ సాగరం నుంచి వచ్చిందని కాదంటున్నారు శాస్త్రవేత్తలు.

Read More : MAA Elections: ‘మా’ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. రెబల్ స్టార్‌కు లేఖలు

భూమి మీదున్న మహాసాగరాల్లో ఉన్న మొత్తం నీటికన్నా..ఈ చందమామలోనే ఎక్కువ నీరు ఉండొచ్చని, అయితే..తీవ్ర శీతల పరిస్థితుల వల్ల అక్కడి ఉపరితలం మీద నీరు ఘనీభవించి ఉందని నాసా వెల్లడించింది. చందమామ ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీగా వైరుధ్యాలు ఉన్నట్లు గుర్తించామని, మధ్యాహ్న సమయంలో అక్కడి మధ్యరేఖా ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటోందన్నారు.