భారీగా తగ్గిన బంగారం ధర

భారీగా తగ్గిన బంగారం ధర

Gold

Reduced gold price : ఈ మధ్యకాలంలో అమాంతం పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నాయి. ఇవాళ బంగారం ధర భారీగా పడిపోయింది. 10 గ్రాముల పసిడి 679 రూపాయలు తగ్గి.. 45వేల కంటే దిగువకు పడిపోయింది. ఢిల్లీలో 10 గ్రాముల పసిడి 44వేల 760 రూపాయలుగా నమోదైంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం వెయ్యి 40 రూపాయలు తగ్గింది. దీంతో 10 గ్రాముల పసిడి 45వేల 930రూపాయలకు చేరుకుంది. ఇక 22 గ్రాముల పసిడి ధర 950 రూపాయలు తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర 42వేల 100 రూపాయలకు చేరుకుంది.

మరోవైపు వెండి ధరలు కూడా దిగివస్తున్నాయి. ఇవాళ ఏకంగా 1847 రూపాయలు తగ్గింది. దీంతో కేజీ వెండి ధర 67వేల 73 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్‌లో 1300 తగ్గి 72వేలు పలుకుతోంది.