Lockdown Snacks Demand : లాక్ డౌన్ లో వాటికి భారీగా పెరిగిన డిమాండ్

కరోనా మహమ్మారి వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా వ్యాపారాలు కుదేలయ్యాయి. అయితే కొన్ని వ్యాపారాలు మాత్రం తిరిగి పుంజుకున్నాయి.

Lockdown Snacks Demand : లాక్ డౌన్ లో వాటికి భారీగా పెరిగిన డిమాండ్

Snack 2

lockdown snacks demand : కరోనా మహమ్మారి వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా వ్యాపారాలు కుదేలయ్యాయి. అయితే కొన్ని వ్యాపారాలు మాత్రం తిరిగి పుంజుకున్నాయి. నష్టాల నుంచి గట్టెక్కి లాభాల బాట పట్టాయి. వాటిలో ప్యాకేజ్డ్ కుకీలు, చిప్స్, నూడుల్స్, మాకరోని వంటి స్నాక్స్ లకు గత రెండేళ్లుగా భారీ డిమాండ్ పెరిగింది.

కరోనా కాలంలో వినియోగదారులు రకరకాల స్నాక్స్ పై ఆసక్తి చూపారు. కాంటార్ విడుదల చేసిన డేటా ప్రకారం ఏప్రిల్-మే 2019 నుంచి ఏప్రిల్-మే 2020 మధ్య కాలంలో స్నాక్స్ కు డిమాండ్ 8 శాతం పెరిగింది. ఏప్రిల్-మే 2020 నుంచి ఏప్రిల్-మే 2021 మధ్య వీటి డిమాండ్ 12 శాతానికి పెరిగింది.

భారత్ లో కరోనా వేగంగా విజృంభించడంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకేసారి లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. లాక్ డౌన్ కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం లేకుండాపోయింది. దీంతో ప్యాకేజ్డ్ కుకీలు, చిప్స్, నూడుల్స్, మాకరోని వంటి స్నాక్స్ కు డిమాండ్ పెరిగింది.

ప్రజలు ఇంట్లో కొత్త రకం వంటకాలతో ప్రయోగాలు చేశారు. ఇంకా పట్టణాలలోని ప్రజలు బ్రాండెడ్ ఆహారాలను కొనుగోలు చేశారు. యూట్యూబ్ లోని ఫుడ్ మేకింగ్ వీడియోలకు డిమాండ్ ఏర్పడింది. అల్పాహార స్నాక్స్ కి భారీగా డిమాండ్ ఏర్పడినట్లు కాంటార్ తెలిపారు. అలాగే బ్రిటానియా ఇండస్ట్రీస్, పార్లే ప్రొడక్ట్స్ గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి.