Akhilesh Yadav: 100 మంది ఎమ్మెల్యేలను తీసుకురండి.. సీఎం అవ్వండి.. యూపీ డిప్యూటీ సీఎంలకు అఖిలేష్ ఆఫర్

అధికార బీజేపీ నుంచి వంద మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకొస్తే సీఎం పదవి ఇస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.

Akhilesh Yadav: ఇద్దరు డిప్యూటీ సీఎంలలో ఎవరైనా సరే.. వంద మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకొస్తే సీఎం పదవి ఇస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అఖిలేష్ యాదవ్ తాజా వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ నేత ఆజం ఖాన్‌ను అధికార బీజేపీ అక్రమ కేసులతో వేధిస్తుందని అఖిలేష్ ఆరోపించారు.

Digital Rupee : డిజిటల్ రూపీ వచ్చేసిందోచ్.. క్రిప్టోకరెన్సీకి, డిజిటల్ రూపాయికి తేడా ఏంటి? ఇది ఎలా కొనాలి? ఎలా వాడాలి? పూర్తి వివరాలు మీకోసం..!

403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో అధికార బీజేపీకి 254కుపైగా సీట్లు ఉన్నాయి. బీజేపీ కూటమికి 272 స్థానాలున్నాయి. సమాజ్‌వాదీ పార్టీకి ఒంటరిగా 110 సీట్లు, కూటమితో కలిపి 118 సీట్లున్నాయి. అక్కడ అధికారం చేపట్లాలంటే 202 సీట్లు ఉండాలి. ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి మరో 92 సీట్లు వచ్చినా అధికారం చేపట్టవచ్చు. ప్రస్తుతం యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ కొనసాగుతుండగా, డిప్యూటీ సీఎంలుగా కేశవ్ మౌర్య, బ్రజేష్ పాఠక్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అఖిలేష్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అఖిలేష్ మాట్లాడుతూ ‘‘యూపీలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వాళ్లు సీఎం అయ్యేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఒక ఆఫర్ ఇస్తున్నాం. వంద మంది ఎమ్మెల్యేలను తీసుకురండి. మీతో మేముంటాం. మీలో ఎవరు వంద మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే వారిని సీఎం చేస్తాం’’ అని ప్రకటించారు.

JioMart On Whatsapp Chat : జియోమార్ట్ యూజర్లకు గుడ్‌ న్యూస్.. ఇకపై నేరుగా వాట్సాప్ చాట్‌లోనే షాపింగ్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

మరోవైపు ఆజాం ఖాన్ సహా తన పార్టీ నేతలను యోగి ప్రభుత్వం వేధిస్తుండటంపై కూడా అఖిలేష్ స్పందించారు. ‘‘అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఎవరైతే ప్రస్తుతం వేధింపులకు గురి చేస్తున్నారో (యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశిస్తూ) వాళ్లకు చెప్పేది ఒక్కటే.. నేను సీఎంగా ఉన్న సమయంలో ప్రస్తుతం సీఎంగా ఉన్న వ్యక్తికి సంబంధించిన ఫైల్ నా దగ్గరికి వచ్చింది. అప్పుడు నేను ఆ ఫైల్‌ను ఆయనకే తిరిగి పంపించాను. నేను చెప్పే మాట మీద నమ్మకం లేకపోతే అధికారులను అడగండి. మేం సమాజ్‌వాదీలం. ప్రతీకారం తీర్చుకోం’’ అని అఖిలేష్ వ్యాఖ్యానించారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు