Vaccination : వ్యాక్సిన్ వేయించుకోవటానికా..వైరస్ అంటించుకోవటానికి వచ్చార్రా బాబూ

‘అరె ఏందిరా బాబూ..వ్యాక్సిన్ వేయించుకోవటానికి వచ్చారా? వైరస్ అంటించుకోవటానికి వచ్చారా?అనేలా ఉంది. జనాలు ఒకరిమీద మరొకరు పడుతూ రావటం చూస్తే..ఒకేసారి వందలాదిమంది వ్యాక్సిన్ వేయించుకోవటానికి రాగా తొక్కిసలాట జరిగింది.

Vaccination : వ్యాక్సిన్ వేయించుకోవటానికా..వైరస్ అంటించుకోవటానికి వచ్చార్రా బాబూ

Vaccination

Covid-19 Vaccination In MP : కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి వ్యాక్సిన్ వేయించుకోవాలి. కానీ టీకా వేయించుకోడానికి ఇలా తండోపతండాలుగా జనాలు తరలిరావటం చూస్తే..‘అరె ఏందిరా బాబూ..వ్యాక్సిన్ వేయించుకోవటానికి వచ్చారా? వైరస్ అంటించుకోవటానికి వచ్చారా?అనేలా ఉంది. జనాలు ఒకరిమీద మరొకరు పడుతూ రావటం చూస్తే..

మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో సాసర్ మండలంలోని లోధిఖేడ గ్రామంలో కరోనా వ్యాక్సిన్ వేసే కేంద్రం వద్ద ఓ షట్టర్ఏర్పాటు చేశారు. అప్పటి వరకూ షట్టర్ క్లోజ్ చేసి ఉంది. కాసేపటికి షట్టర్ ఓపెన్ చేశారు. అంతే దాని కోసమే ఎదురు చూస్తున్న జనాలు ఒకరినొకరు తోసుకుంటూ ఒకరిమీద మరొకరు పడుతూ తొక్కిసలాటాడుకుంటూ వచ్చారు. దీంతో చాలామంది కింద పడిపోగా..వారిమీద మరికొందరు పడిపోయారు.ఇలా ఏకంగా వందల మంది జనాలు ఒకరిపై ఒకరు పడుతూ.. నెట్టుకుంటూ వ్యాక్సిన్ కోసం పోటీ పడ్డారు. వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ డోసులు ఎక్కడ తమకు అందకుండాపోతాయనే ఆందోళనతో ఇలా జనాలు భారీగా ఒకరిమీద మరొకరు పడుతూ వచ్చారు.

వ్యాక్సిన్ డోసులు తక్కువగా ఉన్నాయనే సమాచారంతో చుట్టుపక్కల జనాలంతా ఇలా తండోపతండాలుగా తరలివచ్చారు. అంతమంది ఒక్కసారిగా అక్కడకు చేరుకోవడమే కాకుండా, వ్యాక్సిన్ తమకు కావాలంటే తమకు కావాలని పోటీ పడడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది.ఇదంతా చూస్తేంటే..అరె ఏంటిరా బాబూ వ్యాక్సిన్ వేయించుకోవటానికి వచ్చారా? వైరస్ అంటించుకోవటానికి వచ్చారా?అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.