Trains Cancelled: రసగుల్లా కారణంగా రద్దయిన 40 రైళ్లు.. ఎక్కడంటే..?

రసగుల్లా.. ఈ పేరు చెప్పగానే ప్రతిఒక్కరి నోట్లో నీళ్లూరుతాయి. రసగుల్లాను ఇష్టపడనివారు ఉండరు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే రసగుల్లాను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. అయితే ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో రసగుల్లా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రతీఒక్కరి నోటికి తీపిని రుచిచూపించే రసగుల్లా రైల్వే అధికారుల నోటికి ఒక విధంగా చేదు రుచిని మిగిల్చిందనే చెప్పాలి. అదేంటి రసగుల్లా తియ్యగా ఉంటుంది చేదు ఎలా అవుతుందనేగా మీ డౌట్.. అసలు విషయానికి వద్దాం..

Trains Cancelled: రసగుల్లా కారణంగా రద్దయిన 40 రైళ్లు.. ఎక్కడంటే..?

Trains Cancelled

Trains Cancelled: రసగుల్లా.. ఈ పేరు చెప్పగానే ప్రతిఒక్కరి నోట్లో నీళ్లూరుతాయి. రసగుల్లాను ఇష్టపడనివారు ఉండరు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే రసగుల్లాను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. అయితే ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో రసగుల్లా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రతీఒక్కరి నోటికి తీపిని రుచిచూపించే రసగుల్లా రైల్వే అధికారుల నోటికి ఒక విధంగా చేదు రుచిని మిగిల్చిందనే చెప్పాలి. అదేంటి రసగుల్లా తియ్యగా ఉంటుంది చేదు ఎలా అవుతుందనేగా మీ డౌట్.. అసలు విషయానికి వద్దాం.. రసగుల్లా వల్ల బీహార్ రాష్ట్రం లఖిసరాయ్ లోని బరాహియా రైల్వే స్టేషన్ లో 40గంటల పాటు వందకుపైగా రైళ్లు రద్దయ్యాయి.. మరికొన్ని రైళ్లు దారి మళ్లించబడ్డాయి.

Special Trains : తెలుగు ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. సమ్మర్ స్పెషల్, 104 ప్రత్యేక రైళ్లు

బీహార్‌లోని లఖిసరాయ్‌లోని బరాహియా రైల్వేస్టేషన్‌లో రైళ్లను ఆపాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. దాదాపు 40 గంటలపాటు నిరసన చేపట్టారు. అనేక మంది స్థానికులు రైల్వే ట్రాక్‌లపై టెంట్‌లు వేసి, రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఈ కారణంగా.. హౌరా – ఢిల్లీ రైలు మార్గంలో డజనకుపైగా రైళ్లు 24గంటల పాటు రద్దయ్యాయి. 100కి పైగా రైళ్లను దారి మళ్లించాల్సి పరిస్థితి ఏర్పడింది. లఖిసరాయ్ కలెక్టర్ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బరాహియాలో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాప్ లేదని, కానీ వాటిని ఆపాలంటూ స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో రైల్వే ట్రాక్ పైకి వచ్చి నిరసన తెలిపారని అన్నారు.

Trains Cancellation : కరోనా ఎఫెక్ట్.. 55 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

లఖిసరాయ్ లో తయారయ్యే రసగుల్లాకు ఎంతో ప్రత్యేకత ఉంది. దేశవ్యాప్తంగా ఇది ప్రసిద్ధిగాంచింది. విపరీతమైన డిమాండ్ కారణంగా ఇక్కడి నుంచి స్వీట్లు రవాణా అధికంగా ఉంటుంది. ఇక్కడ తయారు చేసిన స్వీట్లను సమీప రాష్ట్రాలకు పంపిస్తుంటారు. వివాహ సమయంలో, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఆర్డర్లు తీసుకొని రసగుల్లా, ఇతర స్వీట్లను సరఫరా చేస్తుంటారు. లఖిసరాయ్ లో దాదాపు 200లకు పైగా స్వీట్ దుకాణాలు ఉన్నాయి. వీరంతా రోజుకు టన్నుల కొద్దీ రసగుల్లాలను తయారు చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. అయితే రైళ్లు బరాహియా స్టేషన్లో ఆగకపోవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు రవాణా చేయాల్సిన రసగుల్లాలను సకాలంలో అందించక పోలేక పోతున్నామని, రైలు కాకుండా ఇతర వాహనాలను ఆశ్రయిస్తే ఖర్చు ఎక్కువగా ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. రైల్వే స్టేషన్ లో రైళ్లు ఆగకపోవటంతో స్వీట్ దుకాణాల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నామని అక్కడి వ్యాపారులు వాపోయారు.

Special Trains : తిరుపతి-హైదరాబాద్-కాకినాడ ప్రత్యేక రైళ్లు

రసగుల్లా దుకాణం వ్యాపారి రంజన్ శర్మ మాట్లాడుతూ.. ఇంతకుముందు ఈ వ్యాపారాన్ని రైళ్ల ద్వారా నిర్వహించడం ద్వారా ఖర్చు తక్కువగా, సమయానికి రవాణా చేయగలిగామని అన్నారు. కానీ ప్రస్తుతం రైళ్లు బరాహియా స్టేషన్లో ఆగకపోవటం వల్ల నష్టపోతున్నామని వాపోయాడు. ఇదిలా ఉంటే స్థానిక వ్యాపారుల ఆందోళనకు దిగొచ్చిన రైల్వే అధికారులు.. నెల రోజుల్లోగా ఒక ఎక్స్ ప్రెస్ రైలును బరాహియా స్టేషన్ లో ఆగేలా చూస్తామని, ఇతర రైళ్లు కూడా ఇక్కడ ఆగేలా మూడు నెలల్లో చర్యలు తీసుకుంటామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో దుకాణాల వ్యాపారులు నిరసన విరమించారు.