Pan Aadhaar Link : త్వరపడండి.. రూ.10వేలు ఫైన్ తప్పించుకోండి.. పాన్ కార్డుతో ఆధార్‌ లింక్.. ఇలా చేసుకోండి..

మీకు పాన్ కార్డు ఉందా? ఆధార్‌ తో లింక్ చేశారా? చేయకపోతే వెంటనే ఆ పని చెయ్యండి. మార్చి 31లోపు పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయ‌క‌పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

Pan Aadhaar Link : త్వరపడండి.. రూ.10వేలు ఫైన్ తప్పించుకోండి.. పాన్ కార్డుతో ఆధార్‌ లింక్.. ఇలా చేసుకోండి..

Pan Aadhaar Link : మీకు పాన్ కార్డు ఉందా? ఆధార్‌ తో లింక్ చేశారా? చేయకపోతే వెంటనే ఆ పని చెయ్యండి. మార్చి 31లోపు పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయ‌క‌పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్ప‌టికే పాన్‌తో ఆధార్ అనుసంధానానికి ప‌లుమార్లు గ‌డువు పొడిగించిన ఆదాయ‌పు ప‌న్ను శాఖ డెడ్‌లైన్ విధించింది. మార్చి 31లోపు పాన్ కార్డుతో ఆధార్‌ లింక్ చేసుకోక‌పోతే రూ.10వేలు జ‌రిమానా విధిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అందుకే గ‌డువులోపు పాన్‌తో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోండి. రూ.10వేలు ఫైన్ నుంచి తప్పించుకోండి…

మరి.. పాన్ తో ఆధార్ లింక్ చెయ్యడం ఎలా? ప్రాసెస్ ఏంటి? అనే విషయాల్లోకి వెళితే.. రెండు విధాలుగా ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవ‌చ్చు. అది ఎలాగో చూద్దాం..

పాన్ కార్డుతో ఆధార్‌ లింక్ ఆన్‌లైన్‌లో ఇలా…
* ముందుగా ఆదాయ‌పు ప‌న్ను(ఐటీ) శాఖ ఈ ఫైలింగ్ పోర్ట‌ల్ https://incometaxindiaefiling.gov.in/ ఓపెన్ చేయాలి.
* త‌ర్వాత అందులో రిజిస్ట‌ర్ చేసుకోవాలి. పాన్ కార్డు నంబ‌రే ఇక్క‌డ యూజ‌ర్ ఐడీగా ఉంటుంది.
* రిజిస్ట‌ర్ అయిన త‌ర్వాత యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్, పుట్టిన తేదీ వివ‌రాల‌తో లాగిన్ అవ్వాలి.
* లాగిన్ అవ్వ‌గానే పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవాల‌ని ఒక పాప్ అప్ వ‌స్తుంది.
* ఒక‌వేళ పాప్ అప్ రాక‌పోతే ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోని లింక్ ఆధార్ పై క్లిక్ చేయాలి. అప్పుడు పాన్ కార్డులో ఉన్న‌ మీ పేరు, పుట్టిన తేదీ వంటి వివ‌రాలు క‌నిపిస్తాయి. ఆధార్ కార్డులో ఉన్న వివ‌రాల‌తో ఆ వివ‌రాలు స‌రిపోయాయో లేదో చూసుకోవాలి. ఆ త‌ర్వాత ఆధార్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి link now బ‌ట‌న్‌పై క్లిక్ చేస్తే స‌రిపోతుంది.
* అప్పుడు ఆధార్ విజ‌య‌వంతంగా అనుసంధాన‌మైంది అని ఒక పాప్ అప్ వ‌స్తుంది.
* https://www.utiitsl.com/ లేదా https://www.egov-nsdl.co.in/ వెబ్‌సైట్ల ద్వారా కూడా పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసుకోవ‌చ్చు.

మొబైల్ ద్వారా:
* రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ నుంచి 567678 లేదా 56161 నంబ‌ర్‌కు మెసేజ్ చేయ‌డం ద్వారా కూడా పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసుకోవ‌చ్చు. ఇందుకోసం రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ నుంచి 12 అంకెల ఆధార్ నంబ‌ర్ త‌ర్వాత స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేసి ఎస్ఎంఎస్ చేయాలి.

లింక్ అవ్వ‌క‌పోతే..
ఆధార్ కార్డు, పాన్ కార్డుల్లో పేరు, జెండ‌ర్‌, పుట్టిన తేదీ వంటి వివ‌రాలు వేర్వేరుగా ఉంటే ఆధార్‌తో పాన్ కార్డు లింక్ అవ్వ‌దు. అలాంట‌ప్పుడు ఆధార్ కార్డులో త‌ప్పుగా ఉన్న వివ‌రాల‌ను మార్చుకోవాలి. ఆ త‌ర్వాత ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేసుకోవాలి. ఆధార్‌లో వివ‌రాల‌ను యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మార్చుకోవ‌చ్చు. ఒక‌వేళ పాన్ కార్డులో వివ‌రాల‌ను మార్చుకోవాల‌ని అనుకుంటే… https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html ద్వారా మార్చుకోవ‌చ్చు.