రిక్షానే అంబులెన్స్ : భార్య శవంతో 45కిమీ ప్రయాణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దయనీయ ఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది ఎంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారో వెలుగు చూసింది. పేదవారికి అన్నీ కష్టాలే. ఓ

  • Published By: veegamteam ,Published On : September 21, 2019 / 04:06 AM IST
రిక్షానే అంబులెన్స్ : భార్య శవంతో 45కిమీ ప్రయాణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దయనీయ ఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది ఎంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారో వెలుగు చూసింది. పేదవారికి అన్నీ కష్టాలే. ఓ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దయనీయ ఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది ఎంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారో వెలుగు చూసింది. పేదవారికి అన్నీ కష్టాలే. ఓ నిరుపేదకు రిక్షానే అంబులెన్స్ అయ్యింది. రిక్షాలో భార్య శవాన్ని 45 కిమీ తీసుకెళ్లాడు ఆ భర్త. వివరాల్లోకి వెళితే.. భార్య మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వకపోవడంతో తన రిక్షాలోనే శవాన్ని వేసుకుని 45 కిలోమీటర్లు తీసుకెళ్లాడు ఆ భర్త. శంకర్ గఢ్ లోని సరూర్ గంజ్ కు చెందిన కల్లూ భార్య ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలైంది. దీంతో ప్రయాగ్ రాజ్ లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించడంతో ఆమె అక్కడే కన్నుమూసింది. భార్య మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సిబ్బందిని కల్లూ వేడుకున్నాడు. కానీ వారి మనసులు కరగలేదు. ఎవరూ పట్టించుకోలేదు. దీంతో మరో దారి లేక తన రిక్షానే అంబులెన్స్ గా మార్చుకున్నాడు. భార్య మృతదేహాన్ని రిక్షాలో వేసుకుని అలహాబాద్ నుంచి ఇంటి వరకు ఏకంగా 45 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు.

ఈ ఘటన పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యో పాపం అని వాపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు దీనిపై వెంటనే స్పందించాలని, అంబులెన్స్ ఇవ్వని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరంలో ఉన్న వారిని ఆదుకోకపోతే ఎన్ని సౌకర్యాలు కల్పించి ఏం లాభం అని అడుగుతున్నారు.