Husband Sold Wife : భర్త అమానుషం.. అప్పు తీర్చలేక భార్యను ఏం చేశాడంటే..

జీవితాంతం తోడునీడగా నిలవాల్సిన భర్తే భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఏ భర్త చేయకూడని పని చేశాడు. ముగ్గురు వ్యక్తుల దగ్గర అప్పు చేసిన ఆ భర్త, అది తీర్చలేక, కట్టుకున్న భార్యనే

Husband Sold Wife : భర్త అమానుషం.. అప్పు తీర్చలేక భార్యను ఏం చేశాడంటే..

Husband Sold Wife

Husband Sold Wife : జీవితాంతం తోడునీడగా నిలవాల్సిన భర్తే భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఏ భర్త చేయకూడని పని చేశాడు. ముగ్గురు వ్యక్తుల దగ్గర అప్పు చేసిన ఆ భర్త, అది తీర్చలేక, కట్టుకున్న భార్యనే ఆ ముగ్గురికి లక్ష రూపాయలకు అమ్మేశాడు. నిన్ను అమ్మేశారు, ఆ ముగ్గురితో వెళ్లిపొమ్మని భార్యతో చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమె చంపేయాలని చూశాడు. మధ్యప్రదేశ్ గునలో ఈ అమానుషం జరిగింది.

గున ప్రాంతానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో అతడు ముగ్గురు వ్యక్తుల దగ్గర రూ.50 వేలు అప్పు చేశాడు. అయితే ఆ అప్పు తీర్చే మార్గం లేకపోయింది. దీంతో అతడు వారికి తన భార్య లాడో బాయ్ ను లక్ష రూపాయలకు అమ్మేశాడు. గత బుధవారం పొలంలో పనిచేసుకుంటున్న తన భార్య దగ్గరికి వారిని తీసుకెళ్లాడు. వారికి నిన్ను అమ్మేశానని, వారితో వెళ్లిపొమ్మని చెప్పాడు. నిన్ను అమ్మేశారు, వారితో వెళ్లిపో అన్న కట్టుకున్న భర్త అలా చెప్పేసరికి ఆమె నిర్ధాంతపోయింది. షాక్ లో ఉండిపోయింది. అయితే వారితో వెళ్లేందుకు ఆమె నిరాకరించింది. భర్తతో గొడవపడింది. దీంతో బుధవారం రాత్రి గోపాల్, అతడి తల్లి.. ఇంట్లో నిద్రపోతున్న లాడో బాయ్ ని తీసుకెళ్లి బావిలో పడేశారు.

శబ్దం విన్న స్థానికుడు వెంటనే ఆ బావి దగ్గరికి వచ్చి లాడో‌బాయ్‌ను కాపాడాడు. తర్వాతి రోజు లాడో బాయ్ తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త, అత్తపై ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. లాడో బాయ్ అత్త పోలీసులకు దొరికిపోగా, భర్త గోపాల్ తప్పించుకున్నాడు. అతడి కోసం గాలిస్తున్నారు.