Gold Price Today : పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు

గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది.

Gold Price Today : పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు

Gold Price Today

Gold Price Today : గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు (Gold Price) క్రమంగా పెరుగుతున్నాయి. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది. పెళ్లిళ్ల సీజన్ మొదలవడం, బంగారంపై పెట్టుబడి పెట్టేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్లో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200 పెరిగి రూ.44,750కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 పెరిగి రూ. 48,820కి చేరింది. హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో ధరలు ఒకేలా ఉన్నాయి.

చదవండి : Sovereign Gold: సావరీన్ గోల్డ్ బాండ్.. 5రోజుల పాటు అందుబాటులోకి!

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820గా ఉంది.

చదవండి : Gold Rate Today : శుభవార్త.. పది రోజుల తర్వాత దిగొచ్చిన పసిడి ధర

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,820గా ఉంది.

ఇక వెండి విషయానికి వస్తే

బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో తులం వెండి రూ.46 పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తులం వెండి రూ.699గా ఉంది. అదే కేజీ వెండి రూ.69,900కి లభిస్తోంది. ఒక్క గ్రాము ధర రూ.69.90 పలుకుతోంది.