“దిశ” హత్యాచార ఘటనపై హోరెత్తుతున్న పార్లమెంట్

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన "దిశ"  హత్యాచార ఘటనపై పార్లమెంట్ లో  సోమవారం చర్చకు వచ్చింది. దిశ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తరుఫున మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.  దిశ హత్య ఘటనపై  పెరుగుతున్న  నేరాలపై బీజేపీ ఎంపీ ప్రభాత్ ఝూ రాజ్యసభలో జీరో అవర్ నోటీసులు ఇచ్చారు.  

  • Published By: chvmurthy ,Published On : December 2, 2019 / 06:06 AM IST
“దిశ” హత్యాచార ఘటనపై హోరెత్తుతున్న పార్లమెంట్

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన “దిశ”  హత్యాచార ఘటనపై పార్లమెంట్ లో  సోమవారం చర్చకు వచ్చింది. దిశ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తరుఫున మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.  దిశ హత్య ఘటనపై  పెరుగుతున్న  నేరాలపై బీజేపీ ఎంపీ ప్రభాత్ ఝూ రాజ్యసభలో జీరో అవర్ నోటీసులు ఇచ్చారు.  

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన “దిశ”  హత్యాచార ఘటనపై పార్లమెంట్ లో  డిసెంబర్ 2,సోమవారం చర్చకు వచ్చింది. దిశ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తరుఫున మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.  దిశ హత్య ఘటనపై  పెరుగుతున్న  నేరాలపై బీజేపీ ఎంపీ ప్రభాత్ ఝూ రాజ్యసభలో జీరో అవర్ నోటీసులు ఇచ్చారు.  

దిశ హత్య దేశం మొత్తాన్ని కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్.  దేశంలో ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అఘాయిత్యాలు  జరుగుతూనే ఉన్నాయన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయాలన్నారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర మాట్లాడుతూ.. హైదరాబాద్ ఘటన.. ఢిల్లీ ఘటనను గుర్తు చేసి మరోసారి ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేసిందన్నారు. జీరో ఎఫ్ఐఆర్‌పై సుప్రీం ఆదేశాలను పాటించాలని కనకమేడల సూచించారు. ఘటనకు ముందు పెట్రోలింగ్, రక్షణ చర్యలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్భయ చట్టంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సత్వర న్యాయం జరుగుతుందని భావన కలిగేలా తీర్పు ఉండాలన్నారు.

దేశంలో చిన్నారులు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని  దిశను హత్య చేసిన నలుగురు నిందితులను డిసెంబర్ 31 వ తేదీ లోగా ఉరి తీయాలని అన్నాడీఎంకే ఎంపీ విజిల సత్యానంద్ అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు  శిక్షలు వెంటనే అమలు చేయాలని ఎంపీ సుబ్బరామి రెడ్డి అన్నారు. 

కేవలం చట్టాలు చేస్తే సరిపోదని  రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు, చట్టాల్లో మార్పులు  రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  మహిళలపై దాడులకు స్వస్తిపలకాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవలన్నారు. రాజ్యసభలో దిశ ఘటనపై చర్చ జరుగుతోంది.

లోక్ సభలో మధ్యాహ్నం 12 గంటలకు  దిశ ఘటనపై చర్చజరగనుంది. కాగా….. దిశ ఘటనలో అరెస్టైన నలుగురు నిందితులు  చర్లపల్లిజైలులో ఉన్నారు. వారిని  వారం రోజులపాటు కస్టడీకీ ఇవ్వాలని కోరుతూ  షాద్ నగర్ పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్ పై ఈరోజు కోర్టులో విచారణ జరగనుంది.  మరోవైపు దిశ ఘటనను నిరసిస్తూ యువకులు, సామాజిక కార్యకర్తలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.  నల్ల రిబ్బన్లతో ఆందోళన చేపట్టిన వీరు  నిందితులను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.  జస్టిస్ ఫర్ దిశ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.